Earthquake in Tibet: భారీ భూకంపం.. దేశవ్యాప్తంగా ప్రకంపనలు!
Earthquake in Tibet, magnitude 5.7 strikes: టిబెట్‌లో భారీ భూకంపం సంభించింది. తెల్లవారుజామున 2.41నిమిషాలకు భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాజీ వివరించింది.
ఎన్‌సీఎస్ ప్రకారం.. ఈ భూకంపం దాదాపు 10 కిలోమీటర్ల లోతులో వచ్చినట్లు గుర్తించింది. ఈ ప్రకంపనలు దేశవ్యాప్తంగా వచ్చినట్లు తెలిపింది. కాగా, మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాగా, గత కొంతకాలంగా వరుసగా దేశంలో భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మే 9వ తేదీన టిబెట్‌లో 3.7 మ్యాగ్నిట్యూడ్‌తో భూమి కంపించింది.
అయితే మళ్లీ తెల్లవారుజామున 3.06 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7 నమోదైనట్లు తెలిపింది. కాగా, గ్యాంగ్‌టక్ ప్రాంతానికి సుమారు 151 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు వచ్చినట్లు అంచనా వేసింది.
అలాగే, ఈ ప్రకంపనలు వచ్చిన 32 నిమిషాలకు మరోచోట భూకంపం సంభవించింది. ఉదయం 3.48 నిమిషాలకు మూడోసారి భూ ప్రకపంనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో వచ్చినట్లు గుర్తించారు. భూ కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చినట్లు చెప్పారు. ఇలా వరుసగా మూడు సార్లు భూకంపం రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.