Published On:

Burkina Faso Attack: బుర్కినా ఫాసోలో నరమేధం.. 100 మందిని కాల్చి చంపిన ముష్కరులు!

Burkina Faso Attack: బుర్కినా ఫాసోలో నరమేధం.. 100 మందిని కాల్చి చంపిన ముష్కరులు!

100 Killed Al-Qaeda-linked group in Burkina Faso: పశ్చిమ ఆఫ్రికాలో దారుణం చోటుచేసుకుంది. బుర్కినా ఫాసోలో ముష్కరులు నరమేధం చేశారు. 100 మంది ప్రజలను కాల్చిచంపారు. ఉత్తర బుర్కినాఫాసో ప్రాంతంలో జిహాది గ్రూప్ దాడులకు పాల్పడింది. మృతుల్లో ఎక్కువ మంది సైనికులు, కార్మికులు, స్థానికులు ఉన్నారు. అంతేకాకుండా డజిబో పట్టణంతో పాటు పలు స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఈ ఘటనలతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.

 

అయితే, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, సహెల్ సమీపంలో ఉన్న అల్ ఖైదా సంస్థ జమాత్ నస్ర అల్ ఇస్లాం వాల్ ముస్లిమీన్‌తో జిహాదీ గ్రూప్ కలిసి దాడి చేసినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున జిమోతో సహా అనేక ప్రాంతాలపై దాడి చేశారు.

 

అయితే సైనిక జుంటా ఆధ్వర్యంలో ఉన్న బుర్కినా ఫాసోలో 23 మిలియన్ల జనాభా ఉంది. అయితే ఈ ప్రాంతం ఆఫ్రికాలోని సహెల్‌లోని భద్రతా సంక్షోభంతో తీవ్రం దెబ్బతింది. అందుకే ఈ ప్రాంతాన్ని హింసాత్మక తీవ్రవాదానికి మెయిన్ పిల్లర్ అంటూ పిలుస్తారు.

 

అంతకుముందు 2022లో తిరుగుబాట చేయగా.. బుర్కినా ఫాసోలోని సగం భాగం ప్రభుత్వ నియంత్రణ కోల్పోయింది. ఆ సమయంలో ప్రభుత్వ భద్రతా దళాలపై కూడా ఆరోపణలు వినిపించాయి.

 

ఇదిలా ఉండగా, జేఎన్ఐఎమ్ ముష్కరులు ఒకేసారి 8 ప్రాంతాల్లో దాడికి దిగిన్లు అక్కడి ప్రజలు తెలిపారు. తొలుత బుర్కినా ఫాసో ఎయిర్ పోర్టును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో డజిబో పట్టణంలోని వచ్చే దారులను మూసివేశారు. అనంతరం సైనిక స్థావరాలపై దాడికి దిగారు. ఈ శిబిరాల్లో బీభత్సంగా కాల్పులు చేశారు.

 

ఇదిలా ఉండగా, ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో కంట్రీలో ఆర్మీ పాలన నడుస్తోంది. ఆఫ్రికాలో మొత్తం 11 దేశాలు ఉన్నాయి. ఇందులో సహెల్ ప్రాంతం ఒకటి కాగా.. 2.3 కోట్లు జనాభా ఉన్న బుర్కినా ఫాసో మరొకటి. అయితే ఎక్కువగా సంక్షోభం మాత్రం సహెల్‌లో ఉండగా.. దీనిపై సైనిక ప్రభుత్వం సగానికిపైగా వదిలేసింది.

 

కాగా, బుర్కినా ఫాసో దేశాన్ని ఆక్రమించుకునేందుకు గత కొంతకాలంగా ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థలు అలజడి చేస్తున్నాయి. అంతకుముందు 2022లో చాలా మంది సైనికులు దుర్మణం చెందారు. ఇందులో ఆ దేశ భద్రతా బలగాలపై ఎన్నో ఆరోపణలు వినిపించాయి.