Published On:

Earthquake: తెల్లవారుజామున భారీ భూకంపం.. 7 దేశాల్లో భూప్రకంపనలు

Earthquake: తెల్లవారుజామున భారీ భూకంపం.. 7 దేశాల్లో భూప్రకంపనలు

Earthquake in Greece, 6.1 magnitude : యూరప్‌లోని గ్రీస్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. గ్రీస్ సమీప దేశాల్లోని ఈజిప్టు, కైరో, ఇజ్రాయెల్ , లెబనాన్, టర్కీ , జోర్డాన్‌లలోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామున 1:51 గంటలకు దాదాపు 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ప్రస్తుతం ఆస్తి, ప్రాణనష్టం, సునామీ హెచ్చరికలు ఎలాంటివి చోటుచేసుకోలేదు.

 

వివరాల ప్రకారం.. గ్రీకు ద్వీపంలోని కాసోస్ అనే ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున భూమి కంపించింది. దాదాపు 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంప తీవ్రత మొత్తం తూర్పు మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా ప్రభావం చూపిందని అధికారులు వెల్లడించారు.

 

అయితే, ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ ప్రాంతమంతా భూకంపాల ప్రభావంతో వణికిపోయిందని చెబుతున్నారు.

 

ఈ భూకంప కేంద్రాన్ని తెల్లవారుజామున కాసోస్ తీరంలో గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలజికల్ సర్వే వెల్లడించింది. ఏజియన్ సముద్రంలో ఉన్న క్రీట్, రోడ్స్ వంటి ప్రాంతాల్లో భూకంప కేంద్రాని గుర్తించారు. ఈ ప్రాంతంలో దాదాపు 1000కిపైగా జనాభా ఉంటుంది. ఈ ప్రాంతమంతా ప్రశాంతంగా ప్రకృతి సోయగానికి సంకేతంగా ఉంటుందన్నారు.

 

ఇదిలా ఉండగా, గ్రీస్‌లోని కార్పాథోస్, కాసోస్ దీవుల మధ్య  భూకంప తీవ్రతను తొలుత 6.4 మ్యాగ్నట్యూడ్ నమోదైనట్లు తెలపగా.. ఆ తర్వాత రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కాసోస్ క్యాపిటల్ ఫ్రూ నుంచి సుమారు 15 కిలో మీటర్ల దూరం, క్రీట్ లోని అజియోస్ నికోలాస్ నుంచి సుమారు 112 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలజికల్ సర్వే పేర్కొంది.