Published On:

Pakistan: హనీట్రాప్‌లో పాకిస్థాన్ హైకమిషనర్.. యువతితో వీడియోలు హల్చల్

Pakistan: హనీట్రాప్‌లో పాకిస్థాన్ హైకమిషనర్.. యువతితో వీడియోలు హల్చల్

Pakistan High Commissioner to bangladesh Honeytrap issue: పాకిస్థాన్ హైకమిషనర్ హనీట్రాప్‌లో చిక్కుకున్నారు. బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్ హైకమిషనర్‌గా సయ్యద్ అహ్మద్ మరూఫ్ వ్యహరిస్తున్నారు. అయితే ఆయన ఓ బంగ్లాదేశ్ యువతితో కలిసి ఉన్న ఫొటోలు, అశ్లీల వీడియోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు, అశ్లీల వీడియోలు బయటకు రావడంతో కొంతమంది వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వెంటనే పాక్ విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. వెంటనే ఆయనను లీవ్‌పై వెళ్లేలా ఆదేశాలు జారీ చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

ఇదిలా ఉండగా, తొలుత సయ్యద్.. అకస్మాత్తుగా సెలవుపై వెళ్లడంపై చర్చ మొదలైంది. అయితే, ఓ యువతితో క్లోజ్‌గా ఉండడంతో పాటు అశ్లీలంగా కనిపించిన వీడియోలు లీక్ అయ్యాయి. ఈ విషయంపై విచారించగా.. హనీ ట్రాప్ జరిగిందని వార్తలు వచ్చాయి. దీంతో సయ్యద్.. తన పదవి నుంచి వైదొలగినట్లు సమాచారం.

 

కాగా, డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సయ్యద్.. మే 11న ఢాకా నుంచి ఇస్లామాబాద్ వెళ్లినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, ఆయన ఎన్ని రోజులు సెలవులపై వెళ్లారనే విషయం బయటకు రాలేదు. కానీ హానీ ట్రాప్‌లో భాగంగా ఆ యువతితో ఏమైనా నిఘాకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకున్నాడనే అంశంపై తెలియాల్సి ఉంది.

 

తాజాగా, ఢాకాలో పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్‌గా మహ్మద్ ఆసిఫ్ తాత్కాలిక హైకమిషనర్‌గా బాధ్యతలు చేపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్లకు సంబంధించి దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. గతంలో పాకిస్థాన్ వారు బంగ్లాదేశ్ ముస్లిం మహిళలపై దారుణాలకు పాల్పడేవారని, కానీ ప్రస్తుతం వాళ్లే ఇప్పుడు లొంగుతున్నారని ట్వీట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.