Kidney Stones: కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్లు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు తెలుసా ?

Kidney Stones: ప్రస్తుతం చాలా మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ స్టోన్స్ కూడా ఇందులో ఒకటి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఈ రోజుల్లో ఒక సాధారణ సమస్యగా మారింది. దీనికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు మాత్రమే. చాలా సార్లు మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాము. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు పెరగడానికి కారణం అవుతాయి. మరి కిడ్నీ స్టోన్స్ పెరగకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తినకుండా ఉండాలో తెలుసుకుందామా..
ఏ ఆహారం కిడ్నీలను ఎక్కువగా దెబ్బతీస్తుంది ?
అధిక ఉప్పు: ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. అంతే కాకుండా కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది. అందుకే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి.
నీరు: తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఇది మూత్రంలో ఖనిజాలు , ఇతర మూలకాల సాంద్రతను పెంచుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం కూడా కావచ్చు. అందుకే రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగటం ముఖ్యం.
తక్కువ ఫైబర్ : పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం కడుపులో జీర్ణ సమస్యలను కలిగిస్తుంది . అంతే కాకుండా మూత్రపిండాల్లో రాళ్లకు దారితీయవచ్చు.
అధిక ప్రోటీన్ : మాంసాహారం, గుడ్లు, పాల ఉత్పత్తులలో అధిక మొత్తంలో ఉండే ప్రోటీన్ కాల్షియం సమతుల్యతను దెబ్బతీస్తుంది. అంతే కాకుండా ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. ప్రోటీన్ అధికంగా తీసుకోవడం శరీరానికి చాలా హానికరం.
చక్కెర, సోడా ఎక్కువగా తీసుకోవడం: తియ్యటి ఆహార పదార్థాలు, సోడా వంటివి అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఈ పదార్థాలలో కాల్షియం, ఆక్సలేట్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి రాళ్ళు ఏర్పడటానికి సహాయపడతాయి. అంతేకాకుండా.. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేయడంలో కూడా ఉపయోగపడతాయి. అంతే కాకుండా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ?
మూత్రపిండాలు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి.. సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ మూత్రపిండాలను రక్షించుకోవాలనుకుంటే.. ఆహారంలో కొన్ని ఇతర ముఖ్యమైన మార్పులను కూడా చేయాలి .
– తగినంత నీరు త్రాగాలి.
– మీ బరువును అదుపులో ఉంచుకోండి.
-ఎక్కువగా మాంసాహారం తినడం మానుకోండి.
– మీ అవసరాన్ని బట్టి ప్రోటీన్ తీసుకోండి.
-ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తినండి.
ఇవి కూడా చదవండి:
- Drinks for Kidney Disease: ఏవండోయ్.. ఇది విన్నారా..? ఈ సింపుల్ జ్యూస్ లతో కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టొచ్చంటా!