Heat Rashes In Summer: వేసవిలో వచ్చే దద్దుర్ల సమస్యకు.. ఇంట్లోనే చెక్ పెట్టండిలా !

Heat Rashes In Summer: వేసవిలో చర్మంపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు, చర్మం ఎక్కువ వేడిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సీజన్‌లో సూర్యరశ్మి నేరుగా పడటం వల్ల , చర్మం ట్యాన్ అవడం జరుగుతుంది. అంతే కాకుండా వేసవిలో హీట్ రాష్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.
హీట్ రాష్ వల్ల చర్మంపై చిన్న చిన్న ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. ఈ దద్దుర్లు మీ వీపు, ఛాతీ, నడుము, మెడపై ఎక్కువగా వస్తుంటాయి. వేడి దద్దుర్లు రావడానికి ప్రధాన కారణం స్వేద గ్రంథులు మూసుకుపోవడం. అంతే కాకుండా సమ్మర్ లో మీరు వేసుకునే బట్టలు కూడా ఇందుకు కారణం కావచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం ద్వారా మీరు వేడి దద్దుర్ల సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు.
వేడి దద్దుర్లు నివారణ ఇంట్లోనే..
మీరు వేడి దద్దుర్లుతో బాధపడుతుంటే.. వీటి నుండి బయటపడటానికి దోసకాయను ఉపయోగించవచ్చు. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. మీకు కూడా ప్రిక్లీ హీట్ సమస్య ఉంటే దోసకాయ తురుము వేసి ప్రిక్లీ హీట్ మీద రాయండి. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా మీరు తినే ఆహారంలో దోసకాయను తప్పనిసరిగా చేర్చుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
ముల్తానీ మట్టి:
ముల్తానీ మట్టి చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది అనేక రకాల చర్మ సమస్యలను తొలగిస్తుంది. ముల్తానీ మిట్టిని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇందుకోసం మీరు ముల్తానీ మట్టిలో కాస్త నీరు కలిపి మిక్స్ చేసి దద్దర్లు ఉన్న చోట అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముల్తానీ మట్టిని ముల్తానీ మిట్టి వేడి నుండి ఉపశమనం కలిగించడంలో మేలు చేస్తుంది. ముల్తానీ మిట్టిలో లో రోజ్ వాటర్ కలిపి వాడినా కూడా మీరు హీర్ రాష్ సమస్య నుండి బయటపడవచ్చు.
ఐస్ క్యూబ్స్ :
హీట్ వల్ల మీరు ఎక్కువగా దురద లేదా మంటతో ఇబ్బంది పడుతున్న వారు కాటన్ క్లాత్‌లో చుట్టిన ఐస్ క్యూబ్స్‌ను అప్లై చేయండి. ఇది మీ సమస్యకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఐస్ కరిగిపోయే వరకు కొంత సమయం పాటు దద్దుర్లు ఉన్న చోట ఉంచండి. ఇది మీ చర్మానికి తక్షణ ఉపశమనం ఇస్తుంది.
పెరుగు :
పెరుగు కూడా ప్రిక్లీ హీట్ ను తొలగించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే పెరుగులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. కొంచెం పెరుగు తీసుకుని.. దద్దర్లు ఉన్న ప్రదేశంలో బాగా రాయండి. 10 నిమిషాల తర్వాత నీటితో వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. దీనితో మీరు వేసవిలోనూ చల్లగా ఉంటారు.
కలబంద :
కలబంద చర్మానికి కూడా మంచిదని భావిస్తారు. బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో కలబందకు ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి.. మీ చర్మం నుండి వేడి దద్దుర్లు తొలగించాలనుకుంటే కలబందను ఉపయోగించండి. కలబందకు బ్యాక్టీరియాను తొలగించే శక్తి ఉంటుంది. మసాజ్ చేసేటప్పుడు హీట్ రాష్ మీద అలోవెరా జెల్ రాయండి. మీరు త్వరలో దీని ప్రభావాన్ని చూస్తారు. ఇది ప్రిక్లీ హీట్ వల్ల కలిగే మంట నుండి కూడా ఉపశమనం ఇస్తుంది.
బంగాళదుంప:
బంగాళదుంప చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీనివల్ల చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. బంగాళదుంపను వేడి వల్ల వచ్చే దద్దుర్లను తొలగించడానికి ఉపయోగించవచ్చు. బంగాళదుంప ముక్కలను కోసి, చల్లబరచడానికి ఫ్రిజ్‌లో ఉంచండి. తరువాత వేడి దద్దుర్లు ప్రభావితమైన ప్రాంతంలో బంగాళదుంప ముక్కలతో అప్లై చేయండి. ఇది ప్రిక్లీ హీట్ వల్ల కలిగే మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది.