Published On:

Pawan Kalyan Step in OG: బిగ్‌ బ్రేకింగ్‌.. ఓజీ ఈజ్‌ బ్యాక్‌ – సెట్లోకి అడుగుపెట్టిన పవన్‌ స్టార్‌

Pawan Kalyan Step in OG: బిగ్‌ బ్రేకింగ్‌.. ఓజీ ఈజ్‌ బ్యాక్‌ – సెట్లోకి అడుగుపెట్టిన పవన్‌ స్టార్‌

Pawan Kalyan Joins in OG Movie Set: వపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కి బిగ్‌ బ్రేకింగ్‌. అభిమానులంత ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఆ సమయం వచ్చేసింది. ఓజీ సెట్‌లో అడుగుపెట్టేశాడు.. ఇక ముగింపే అంటుంది మూవీ టీం. ఈ మేరకు ఫ్యాన్స్‌కి కిక్కిచ్చేలా క్రేజీ పోస్ట్‌తో అప్‌డేట్‌ ఇచ్చింది ఓజీ మూవీ టీం. కాగా పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా సాహో ఫేం సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఓజీ- ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌’ (OG Movie-They Call Him OG).

 

ప్రస్తుతం పవన్‌ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కానీ, అన్నింటికంటే ఎక్కువ ఓజీ మూవీపైనే బజ్‌ ఎక్కువగా ఉంది. ఈ సినిమా రిలీజ్‌ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో వల్ల మూవీకి బ్రేక్స్‌ ఎక్కువగా పడ్డాయి. స్లోస్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడ ఫైనల్‌ షెడ్యూల్‌ చిత్రీకరణకు సిద్ధమైంది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత పవన్‌ మూవీ సెట్‌లో అడుగుపెట్టాడు. ఇదే విషయాన్ని తాజాగా మేకర్స్‌ ప్రకటించారు.

 

కాగా ఓజీ మూవీ షూటింగ్‌ మళ్లీ మొదలైందంటూ రెండు రోజుల క్రితం మూవీ నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే పవన్ కళ్యాణ్‌ ఎప్పుడు సెట్లోకి వస్తాడనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఈ క్రమంలో ఇవాళ (మే 14) పవన్‌ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఆయన ఓజీ సెట్లోకి తిరిగి వచ్చారని, ఈ సారి ముగించడమే మిగిలి ఉందంటూ మూవీ టీం పేర్కొంది. ఆయన పవన్‌ తిరికి సెట్లోకి రావడంతో ఫ్యాన్స్‌ అంత పండగ చేసుకుంటున్నారు.

 

ఈ షెడ్యూల్‌ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. పవన్‌తో పాటు మూవీలో ప్రధాన తారాగణంతో కీలక సిన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ రెండు, మూడు వారాల పాటు కొనసాగనుందట. ఇందులో పోగరు పేం శ్రీయా రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఆమె ఓజీ సెట్లో అడుగుపెట్టారు. ఇందులో పవన్‌ సరసన ‘గ్యాంగ్ లీడర్‌’ ఫేం ప్రియాంక మోహన్‌ ఆరుళ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.