Dark Spots: ముఖంపై నల్ల మచ్చలా ? ఈ హెం రెమెడీస్తో చెక్ పెట్టండిలా

Dark Spots: ముఖంపై మచ్చలు ఒక సాధారణ సమస్య. ఇది సూర్య కిరణాలు, హార్మోన్ల మార్పులు లేదా ఇతర చర్మ సమస్యల వల్ల వస్తుంటాయి. ఈ మచ్చలు ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ముఖ సౌందర్యాన్ని కూడా తగ్గిస్తాయి. మార్కెట్లో చాలా రకాల క్రీములు, అందుబాటులో ఉన్నప్పటికీ.. హోం రెమెడీస్ మాత్రమే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మచ్చలను సులభంగా తొలగించి.. చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి. వీటిని ఎలా తయారు చేసుకుని వాడాలో తెలుసుకుందామా..
పసుపు ,పాలతో ప్యాక్:
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై చికాకు , మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. మచ్చలను తగ్గించడానికి ఒక చెంచా పసుపును ఒక చెంచా పాలలో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోండి. తర్వాత 20 ఆగి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఈ హోం రెమెడీస్ చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా, మచ్చలు లేకుండా చేసుకోవచ్చు.
నిమ్మకాయ, తేనెతో ఫేస్ ప్యాక్:
నిమ్మకాయలో సిట్రస్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మం యొక్క రంగును కాంతివంతం చేస్తుంది. అంతే కాకుండా మచ్చలను తగ్గిస్తుంది. తేనె చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా చేస్తుంది. అర టీస్పూన్ తేనెలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ మిశ్రమం ముఖంపై ఉన్న మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అలోవెరా జెల్:
అలోవెరా చర్మానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా క్రమంగా మచ్చలను తొలగిస్తాయి. ఇందుకోసం తాజా కలబంద జెల్ ను నేరుగా ముఖంపై అప్లై చేసి.. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది మీ చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అంతే కాకుండా మచ్చలను తగ్గిస్తుంది.
నారింజ తొక్క:
నారింజ తొక్కలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మం యొక్క రంగును కాంతివంతం చేయడానికి , మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. నారింజ తొక్కను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడికి కాస్త నీళ్లు కలిపి పేస్ట్ లా చేసి మచ్చలపై రాయండి. 15 నిమిషాల తర్వాత ముఖం వాష్ చేయండి. ఈ హోం రెమెడీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అంతే కాకుండా మచ్చలను తగ్గిస్తుంది.
టమాటో రసం:
టమాటోలలో లైకోపీన్, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. టమాటో రసం చర్మంపై మచ్చలను తొలగిస్తుంది. తాజా కాస్త టమాటో రసం తీసి ముఖానికి నేరుగా అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి . ఇది చర్మ రంగును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మచ్చలను తగ్గిస్తుంది.