Published On:

Fast Walk for Weight Loss: ప్రతి రోజు 30 నిమిషాలు ఇలా చేస్తే.. బరువు తగ్గడం గ్యారంటీ

Fast Walk for Weight Loss: ప్రతి రోజు 30 నిమిషాలు ఇలా చేస్తే.. బరువు తగ్గడం గ్యారంటీ

Fast Walk For Weight Loss: బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు బ్రిస్క్ వాకింగ్ బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతుండగా.. మరికొందరు బ్యాక్ వాకింగ్ బెస్ట్ రిజల్ట్ ఇస్తుందంటారు. కానీ ఈ రోజుల్లో వేగంగా నడవడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది జీర్ణ ప్రక్రియ మెరుగుపడటమే కాకుండా బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సాధారణ నడక కంటే వేగంగా నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నడక యువతకే కాదు.. వృద్ధులకు కూడా చాలా మేలు చేస్తుంది. బరువు తగ్గడంలో బ్రిస్ వాకింగ్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందామా..

 

ఫాస్ట్ వాక్ అంటే ఏమిటి..?

ఫార్ట్ వాక్ అంటే భోజనం చేసిన తర్వాత నడిచే వేగవంతమైన నడక.తిన్న తర్వాత నడవడం వల్ల పేగుల పనితీరు పెరుగుతుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలోని గ్యాస్ తొలగించడంలో , మలబద్ధకం నుండి బయటపడటానికి కూడా ఇది సహాయపడుతుంది.

 

తిన్న తర్వాత, కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఇది కడుపు ఉబ్బరం వంటి సమస్యకు కారణమవుతుంది. వేగంగా నడవడం వల్ల ఈ సమస్యల నుండి పూర్తిగా విముక్తి కలుగుతుంది.

 

ఫార్ట్ వాక్ వల్ల కలిగే ప్రయోజనాలు:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: వేగంగా నడవడం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది.ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని నమ్ముతారు. కార్బోహైడ్రేట్, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత ఫాస్ట్ గా నడవడం వల్ల గ్యాస్ సమస్య నుండి బయటపడవచ్చు.

 

మధుమేహాన్ని నియంత్రిస్తుంది: నడక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు తిన్న తర్వాత కూర్చుంటే.. రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది. కానీ నడవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధిస్తుంది.

 

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది: ఫాస్ట్ వాకింగ్ తీవ్రమైన వ్యాయామం కానప్పటికీ.. భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. అంతే కాకుండా ఇది మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. శరీర బరువును త్వరగా తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు గంటసేపు నడవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.

 

మనం ఎంతసేపు ఫార్ట్ వాక్ చేయాలి..?

భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల శరీరంలోని అన్ని భాగాలు సజావుగా పనిచేస్తాయి. తిన్న తర్వాత దాదాపు 15-20 నిమిషాలు తప్పకుండా నడవాలి. గుండె ఆరోగ్యం కోసం దాదాపు 30 నిమిషాలు నడవండి. అయితే డయాబెటిస్ ఉన్నవారు దాదాపు 40 నిమిషాలు నడవాలి.

ఇవి కూడా చదవండి: