Published On:

Kingdom Postponed: రూమర్సే నిజం అయ్యాయి – విజయ్‌ దేవరకొండ కింగ్‌డమ్‌ వాయిదా, కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే!

Kingdom Postponed: రూమర్సే నిజం అయ్యాయి – విజయ్‌ దేవరకొండ కింగ్‌డమ్‌ వాయిదా, కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే!

Vijay Devarakonda kingdom Movie Postponed: రూమర్సే నిజం అయ్యాయి. విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌ మూవీ వాయిదా పడింది. కాగా లైగర్‌, ఖుషి వంటి ప్లాప్స్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం కింగ్‌ డమ్‌. ఈసారి విజయ్‌ కింగ్‌డమ్‌తో గట్టి కంబ్యాక్‌ ఇవ్వడం పక్కా అంటూ మూవీ టీం, అటూ అభిమానులు నమ్ముతున్నారు. దీంతో ఈ మూవీ రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి.. మే 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించి గుడ్‌న్యూస్ చెప్పింది.

 

అయితే కొన్ని రోజులుగా ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలపై మూవీ టీం ఏమాత్రం స్పందించలేదు. దీంతో అంతా డైలామాలో పడ్డారు. ఇక ఆ రూమర్స్‌నే నిజం చేస్తూ కింగ్‌డమ్‌ను వాయిదా వేస్తున్నట్టు తాజాగా మూవీ టీం ఓ ప్రకటనతో వచ్చింది. ఇది చూసి విజయ్‌ ఫ్యాన్స్‌ డిసప్పాయింట్‌ అవుతున్నారు. ఈ మేరకు మూవీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రకటన ఇచ్చింది.

 

కొత్త రిలీజ్ డేట్ ఇదే!

“అనుకున్న తేదీగా సినిమాను రిలీజ్‌ చేయాలని ఎంతో ప్రయత్నించాం. కానీ, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సినిమాను వాయిదా వేయక తప్పలేదు. మే 30న విడుదల చేయాల్సిన కింగ్‌డమ్‌ మూవీ జూలై 4వ తేదీకి వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మూవీ ప్రమోషనల్‌ ఈవెంట్స్‌, సెలబ్రేషన్స్‌ని జరపుకోవడం సరైనది కాదని మా టీం భావించింది. అందుకు కింగ్‌ డమ్‌ను తప్పక వాయిదా వేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ మా నిర్ణయాన్ని ప్రేక్షకులు స్వాగితిస్తారని ఆశిస్తూన్నాము. అలాగే మీ మద్దతు కొనసాగుతూనే ఉంటుందని, జూలై 4న విడుదల కానున్న ఈ సినిమా ఆదరిస్తారని నమ్ముతున్నాము” అంటూ రాసుకొచ్చింది.

 

తమ్ముడు టీంకి స్పెషల్ థ్యాంక్స్

కింగ్‌డమ్‌ వాయిదా వేసుకునే విషయంలో తమకు మద్దతు ఇచ్చిన నిర్మాత దిల్‌ రాజు, హీరో నితిన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా కింగ్‌డమ్‌ వాయిదా విషయంలో జులై 4న విడుదల కావాల్సిన తమ్ముడు సినిమాను పోస్ట్‌పోన్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కింగ్‌డమ్‌ టీం ధన్యవాదాలు తెలిపింది. కాగా జెర్సీ ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్‌డమ్‌ మూవీ తెరకెక్కుతోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌ గూఢాచారిగా కనిపించబోతున్నాడు. మిస్టర్‌ బచ్చన్‌ ఫేం భాగ్యశ్రీ భోర్సె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సితారఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.