Tired Exercise: అలసిపోయారా..? అయితే వ్యాయామం చేయండి, రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు!

Benefits of Tired Exercise: అలసటగా లేదా శక్తిలేనట్టు అనిపించినప్పుడు ఎవరైనా వ్యాయామం చేయామని చెబితే ఆశ్చర్యపోతాం. కానీ ఇది నిజం. అలసిపోయి, శక్తిహీనంగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడానికి బెస్ట్ టైం. ఎందుకంటే చెమటలు పట్టే వ్యాయామం చేయడం వల్ల మీకు కొత్త శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఇది అలసటను తగ్గించి మానసిక కుంగుబాటును నివారించడంలో సహాయపడుతుంది.
వ్యాయామం శక్తిని ఎలా ఇస్తుంది ?
శారీరక శ్రమ తర్వాత శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ఆక్సిజన్, పోషకాలను.. కండరాలు, మెదడుకు వేగంగా చేరవేస్తుంది. ఫలితంగా మీ శరీరం తాజాగా అనిపిస్తుంది. అలాగే వ్యాయామం సమయంలో ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు మానసిక ఒత్తిడిని తగ్గించి సంతోషకరమైన భావనను కలిగిస్తాయి. ఓ అధ్యయనాల ప్రకారం.. కేవలం 20-30 నిమిషాల పాటు వ్యాయామం చేసినా కూడా శక్తి స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి.
వ్యాయామం శక్తిని ఎలా ఇస్తుంది ?
శారీరక శ్రమ తర్వాత శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ఆక్సిజన్, పోషకాలను.. కండరాలు, మెదడుకు వేగంగా చేరవేస్తుంది. ఫలితంగా మీ శరీరం తాజాగా అనిపిస్తుంది. అలాగే వ్యాయామం సమయంలో ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు మానసిక ఒత్తిడిని తగ్గించి సంతోషకరమైన భావనను కలిగిస్తాయి. ఓ అధ్యయనాల ప్రకారం.. కేవలం 20-30 నిమిషాల పాటు వ్యాయామం చేసినా కూడా శక్తి స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి.
అలసట, కుంగుబాటును నివారిస్తుంది:
రోజూ రొటీన్, ఒత్తిడితో కూడిన పనులు మనల్ని మానసికంగా, శారీరకంగా అలసిపోయేలా చేస్తాయి. ఇలాంటి సమయంలో సోఫాలో కూర్చుని కాస్త రిలాక్స్ అవడం అందరూ చేసే పనే. . కానీ ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది. మరోవైపు వ్యాయామం శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించి, మనసును ఉత్తేజపరుస్తుంది. వ్యాయామం కుంగుబాటు లక్షణాలను తగ్గిస్తుందని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో రుజువైంది.
ఎలా ప్రారంభించాలి ?
అలసటగా ఉన్నప్పుడు జిమ్‌కు వెళ్లడం లేదా ఎక్కువ సేపు వ్యాయామం చేయడం అవసరం లేదు. చిన్న చిన్న పనులు చేయడం ద్వారా కూడా గొప్ప ఫలితాలు లభిస్తాయి.
ఫాస్ట్ వాకింగ్ :
20 నిమిషాలు వేగంగా నడవడం వల్ల శరీరం ఉత్తేజం అవుతుంది. సాయంత్రం పార్కులో నడవడం లేదా ఇంటి చుట్టూ ఒక రౌండ్ వేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
యోగా లేదా స్ట్రెచింగ్:
శరీరంలో ఉద్రిక్తతను తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచే సాధారణ యోగా ఆసనాలు చేయండి.
డ్యాన్స్:
మీకు ఇష్టమైన సాంగ్‌కు 10-15 నిమిషాలు డ్యాన్స్ చేయడం మీ శక్తిని పెంచడమే కాక.. ఆనందాన్ని కూడా ఇస్తుంది.
సైక్లింగ్:
ఇంటి దగ్గరలో సైకిల్ తొక్కడం కూడా మంచి ఎంపిక.
ముఖ్యంగా.. మీ శరీర సామర్థ్యానికి తగిన వ్యాయామాన్ని ఎంచుకోండి. అతిగా చేయడం వల్ల శరీరం మరింత అలసిపోవచ్చు. రోజూ ఒకే సమయంలో వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. తద్వారా ఇది మీ రొటీన్‌లో భాగమవుతుంది.
అలసటగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడం మొదట్లో కష్టంగా అనిపించవచ్చు. కానీ ఒకసారి మీరు దీన్ని ప్రయత్నిస్తే ప్రయోజనాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కేవలం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాక మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. కాబట్టి వ్యాయామం చేసి శక్తివంతంగా ఉండండి.