Published On:

Bathing Tips: సమ్మర్‌లో చెమట వాసన రాకుండా, తాజాగా ఉండాలంటే.. ?

Bathing Tips: సమ్మర్‌లో చెమట వాసన రాకుండా, తాజాగా ఉండాలంటే.. ?

Bathing Tips: ఏప్రిల్ నెల నడుస్తోంది. దీంతో సూర్యుడి ఉష్ణోగ్రత రోజు రోజుకూ పెరగడం ప్రారంభమైంది. మండుతున్న ఎండల కారణంగా ప్రజల పరిస్థితి మరింత దిగజారుతోంది. ఈ సీజన్‌లో.. చాలా మంది చెమటతో ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల శరీరం దుర్వాసన రావడం కూడా మొదలవుతుంది. ఈ దుర్వాసన కారణంగా కూడా జనం ఇబ్బందికి గురవుతున్నారు. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. మీరు స్నానపు నీటిలో కొన్ని పదార్థాలను కలపడం ద్వారా చెమట వాసనను వదిలించుకోవచ్చు.

వేప ఆకులు: మీరు కూడా సమ్మర్‌లో చెమట వాసనతో కూడా ఇబ్బంది పడుతుంటే.. స్నానపు నీటిలో వేప ఆకులు వేసి మరిగించాలి. దీని కోసం.. ఒక గిన్నెలో నీరు తీసుకుని, అందులో వేప ఆకులు వేయండి. ఇప్పుడు ఈ నీటిని మరిగించండి. నీరు చల్లబడిన తర్వాత దానిని వడకట్టి స్నానపు నీటిలో కలపండి. ఇప్పుడు ఈ నీరు స్నానానికి ఉపయోగించండి.

రోజ్ వాటర్: మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే చెమట వాసనను తొలగించడానికి దాన్ని ఉపయోగించండి. దీన్ని ఉపయోగించడానికి.. మీరు స్నానపు నీటిలో రెండు నుండి మూడు చెంచాల రోజ్ వాటర్ కలపాలి. ఇప్పుడు ఈ నీరు స్నానానికి సిద్ధంగా ఉంటుంది. రోజ్ వాటర్‌ని నీటిలో కలిపి ప్రతిరోజూ ఆ నీటితో స్నానం చేయండి. దీన్ని ఉపయోగించడం ద్వారా మీరు చెమట వాసన నుండి ఉపశమనం పొందుతారు.

బేకింగ్ సోడా: బేకింగ్ సోడా ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటుంది. అందుకే.. చెమట వాసనను వదిలించుకోవడానికి మీరు బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించడానికి.. రెండు చెంచాల బేకింగ్ సోడాను స్నానపు నీటిలో కలిపి, ఆ నీటితో స్నానం చేయండి. ఈ నీటితో స్నానం చేసే ముందు.. ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ బేకింగ్ సోడా అందరికీ సరిపోదు. దీని కారణంగా మీరు అలెర్జీలను ఎదుర్కోవలసి రావచ్చు.

అలోవెరా జెల్: మీ ఇంట్లో అలోవెరా మొక్క ఉంటే.. స్నానం చేసే నీటిలో అలోవెరా జెల్ కలపండి. ఈ నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. ఈ నీరు చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి: