Last Updated:

Vijay Devarakonda : 100 కుటుంబాలకు లక్ష చొప్పున కోటి రూపాయలు గిఫ్ట్ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ..

విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఖుషీ". మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని దక్కించుకుంది. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ముగ్గురు ఫ్లాప్ ల తర్వాత ఈ సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. నేటి తరానికి తగ్గట్టు లవ్, మ్యారేజ్, జాతకాలు,

Vijay Devarakonda : 100 కుటుంబాలకు లక్ష చొప్పున కోటి రూపాయలు గిఫ్ట్ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “ఖుషీ”. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని దక్కించుకుంది. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ముగ్గురు ఫ్లాప్ ల తర్వాత ఈ సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. నేటి తరానికి తగ్గట్టు లవ్, మ్యారేజ్, జాతకాలు, కులాలు అన్నీ కలిసి వచ్చేలా ప్రేమ కథను రూపొందించి ప్రేక్షకులను అలరించగలిగారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఈ తరుణం లోనే మూవీ టీం వైజాగ్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఇక ఈ ఈవెంట్లో మూవీ యూనిట్ తో పాటు విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నాడు. కాగా ఈ కార్యక్రమం వేదికగా తన అభిమానులకు పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు విజయ్ (Vijay Devarakonda). ఇప్పటి వరకు ఏ హీరో ఈ విధంగా చేయలేదని కూడా చెప్పొచ్చు. ఖుషీకి వచ్చిన రెమ్యూనిరేషన్ లో ఒక కోటి రూపాయలు అభిమానుల కోసం ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా విజయం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. మీ హ్యాప్పీ ని కూడా చూద్దాం అనుకున్నాను. చూసేశాను.. అలానే పర్సనల్ గా మీ అందరినీ కలవాలని ఉంది కానీ కలవలేను. అందుకే నా ఖుషి మీతో పంచుకునేందుకు నా ఖుషి సంపాదన నుంచి కోటి రూపాయలు నా ఫ్యామిలీ అయిన మీకు ఇస్తున్నా. త్వరలో వంద ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేసి ప్రతి ఫ్యామిలీకి లక్ష రూపాయల చెక్ నేను అందిస్తాను. నా హ్యాపీనెస్ లాగే నా సంపాదన కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరంతా దేవర ఫ్యామిలీ. నా సోషల్ మీడియాలో ఒక ఫామ్ పెడతాను స్ప్రెడింగ్ ఖుషి అని. దాన్ని ఫీల్ చేసి పంపిస్తే నేను లక్కీ 100 ఫ్యామిలీలను సెలెక్ట్ చేస్తాను. నేనిచ్చే మనీ మీకు రెంట్స్, ఫీజు దేనికి హెల్ప్ అయినా నాకు సంతోషం అని అన్నారు.

 

 

అలానే ఇంకా మాట్లాడుతూ.. ఖుషి మీద మీరు చూపిస్తున్న ప్రేమ నాకు తెలుస్తోంది. నేను ఇంట్లో ఉన్నా ఆ ప్రేమను ఫీలవుతున్నా. నా మీద, నా సినిమా మీద అటాక్స్ జరుగుతున్నాయి. మా ఖుషి మీద ఫేక్ బుక్ మై షో రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. వేలాది ఫేక్ అక్కౌంట్స్ క్రియేట్ చేసి, యూట్యూబ్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇందుకు కొంతమంది డబ్బులు ఖర్చు చేస్తున్నారు. నా మీద, నా సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.

అవన్నీ దాటుకుని అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ నెంబర్స్, సక్సెస్ అందుకుంటున్నాం. ఈ విజయానికి మీరే కారణం. మూడు రోజుల్నించి చూస్తున్నా మీ మొహల్లో సంతోషం చూసి నాకు చాలా తృప్తిగా ఉంది అని అన్నాడు. దీంతో విజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీంతో అభిమానులు విజయ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరి ఆ 100 ఫ్యామిలీలు ఎవరివో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.