Published On:

Kingdom First Single: అనిరుథ్ మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేయనున్నాడా.. ?

Kingdom First Single: అనిరుథ్ మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేయనున్నాడా.. ?

Kingdom First Single: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. లైగర్ సినిమా నుంచి ఇప్పటివరకు విజయ్ కి ఒక్క హిట్ లేదు. ఇక ఈసారి ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందులో భాగంగా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ సినిమా చేస్తున్నాడు.

 

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో విజయ్ రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా.. ఖైదీగా కూడా కనిపిస్తున్నాడు.

 

మే 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్  డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 30 న మొదటి  సాంగ్ ప్రోమో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రైల్వే స్టేషన్ బెంచ్ పై విజయ్, భాగ్యశ్రీ కూర్చొని కనిపించారు.

 

ఇక ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ సినిమాతో అనీ.. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.