Last Updated:

#PR04: మైత్రీ మేకర్స్‌తో మరోసారి జతకట్టిన ‘డ్రాగన్‌’ హీరో – ప్రదీప్‌ రంగనాథన్‌ జోరు మామూలుగా లేదుగా..

#PR04: మైత్రీ మేకర్స్‌తో మరోసారి జతకట్టిన ‘డ్రాగన్‌’ హీరో – ప్రదీప్‌ రంగనాథన్‌ జోరు మామూలుగా లేదుగా..

Pradeep Ranganathan Collaborate With Mythri Makers: ప్రదీప్‌ రంగనాథన్‌.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఈ పేరు మారుమ్రోగుతుంది. లవ్‌టుడే, ‘డ్రాగన్‌’ చిత్రాలతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు తెలుగులో ఒక్క స్ట్రయిట్‌ మూవీ లేదు. కానీ, ఇక్కడ అతడి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రం బాగానే ఉంది. యుత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలతో యమ క్రేజ్‌ సంపాదించుకున్నాడు.

‘లవ్‌టుడే’ చిత్రంలో డైరెక్టర్‌, హీరోగా ఫుల్‌ సక్సెస్‌ అయ్యాడు. రీసెంట్‌గా ‘డ్రాగన్‌’ చిత్రంతో హీరోగానే మార్కులు కొట్టేశాడు. తమిళంలో తెరకెక్కన ఈ సినిమా తెలుగులోనూ రిలీజైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ ‘డ్రాగన్‌’ తెలుగు రైట్స్‌ తీసుకుని ఇక్కడ విడుదల చేశారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. దీంతో ప్రదీప్‌ రంగనాథన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ మరో సినిమాకు ఒప్పందం చేసుకున్నారు. ప్రదీప్‌ 4వ చిత్రంగా ఈ సినిమా రానుంది. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ ప్రకటన ఇచ్చారు.

#PR04గా ఈ సినిమా రానుంది. ఈ మేరకు లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ ఫస్ట్‌ షాట్‌ బూమ్‌ రేపు (మార్చి 26 )ఉదయం 11:07 గంటలకు రానుందంటూ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. చూస్తుంటే రేపే మూవీని లాంచ్‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు కీర్తి స్వరన్‌ దర్శకత్వం వహిస్తున్నట్టు మేకర్స్‌ వెల్లడించారు. అత్యంత భారీ ప్రాజెక్ట్‌ ఇది, తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్‌ ఇది రెండవ తమిళ సినిమా కానుండటం విశేషం.