Published On:

Vijay Devarakonda: తరుణ్ భాస్కర్ ‘బినామీ’ గా మారిన విజయ్ దేవరకొండ.. ?

Vijay Devarakonda: తరుణ్ భాస్కర్ ‘బినామీ’ గా మారిన విజయ్ దేవరకొండ.. ?

Vijay Devarakonda:  రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిన విజయ్.. దానికి ముందు పెళ్లి చూపులు సినిమా  అతడిలోని నటనను బయటపెట్టింది. హీరోగా పెళ్లి చూపులు మొదటి సినిమా. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2018లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

 

ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది సినిమాలో క్యామియో రోల్ లో కనిపించిన విజయ్.. ఆ తరువాత తరుణ్ భాస్కర్ ను హీరోగా పెట్టి ఒక సినిమా తీసాడు. అదే మీకు మాత్రమే చెప్తా. ఇక ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీని తరువాత వీరి కాంబోలో ఒక్క సినిమా వచ్చింది లేదు. ఆ తరువాత తరుణ్ భాస్కర్ సైతం డైరెక్టర్ గా కాకుండా నటుడిగా బిజీ అయ్యాడు.

 

ఎప్పుడో తరుణ్.. వెంకీకి ఒక కథ వినిపించాడని, అది పట్టాలెక్కడానికి రెడీగా ఉందని వార్తలు వినిపించాయి. కానీ, అది ఇంకా బయటకు రాలేదు. ఈలోపు తరుణ్.. మలయాళంలో సూపర్ హిట్ అయిన జయ జయ జయ జయహే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న  సినిమాలో నటిస్తున్నాడు.

 

ప్రస్తుతం విజయ్, తరుణ్ఇద్దరు  తమ తమ సినిమాలతో బిజీగా ఉన్న ఈ కాంబో.. పెళ్లి చూపులు తరువాత ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బినామీ అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఇక ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతుంది అని తెలిసేసరికి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రస్తుతం విజయ్ కింగ్డమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మే 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత బినామీ మొదలవుతుంది అని తెలుస్తోంది. మరి పెళ్లి చూపులు కాంబో మరోసారి హిట్ అందుకుంటుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి: