Published On:

Vijay Devarakonda: గిరిజన వివాదంపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

Vijay Devarakonda: గిరిజన వివాదంపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

Vijay Devarakonda Reacted on Tribes Controversy: సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారం రేపుతున్నాయి. పహల్గాం దాడి ఘటనపై స్పందిస్తూ విజయ్‌ గిరిజనుల ఉద్దేశించిన వ్యాఖ్యలు చేశాడు. ఇవి ఆ వర్గం వారిని కించపరిచేలా ఉన్నాయని, గిరిజలను ఉద్రవాదులను పోల్చిన విజయ్ దేవరకొండ చర్యలు తీసుకోవాలని పలు ట్రైబల్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కిషన్‌ రాజ్‌ చౌహన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్‌ ఎస్సీ/ఎస్టీ ఆట్రాసిటి కేసు పెట్టారు. తాజాగా ఈ వివాదంపై విజయ్‌ స్పందించాడు.

 

తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ ఈ మేరకు ఓ ప్రెస్‌ నోట్ రిలీజ్‌ చేశాడు. “ఇటీవల రెట్రో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నేను చేసిన కామెంట్స్‌ కొందరినికి బాధించాయని నా దృష్టికి వచ్చింది. దీనిపై నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ వర్గాన్నీ, ఏ తెగనూ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. ముఖ్యంగా మన గిరిజనులను కించపరిచే ఉద్దేశం అస్సలే లేదు. నేను ఎప్పుడు ఏ సమూహంపై ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ వివక్ష చూపలేదు. మనమంత ఒకే కుటుంబంగా భావిస్తాను. అయితే నా మాటలు ఎవరినైనా ఇబ్బంది కలిగించినందుకు చింతిస్తున్నాను. శాంతి గురించి మాట్లాడమే నా లక్ష్యం” అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అనంతరం తన గిరిజనులు పదం వాడటంపై విజయ్‌ వివరణ ఇచ్చాడు.

 

“ట్రైబ్స్‌.. చారిత్రక నిఘంటు ద్రస్టికోణంలోనే నేను ఈ పదాన్ని వాడను. వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా ఉండేవాళ్లని నా ఉద్దేశం. అలాంటి సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. అదే చెప్పడానికి నేను ఈ పదాన్ని వాడాను. ఆ సెన్స్‌లోనే ట్రైబ్స్‌ అనే పదాన్ని ఉపయోగించాను. అంతేకాని ఇప్పుడున్న షెడ్యూల్‌ ట్రైబ్స్‌ని ఉద్దేశించి నేను ఈ వ్యాఖ్యలు చేయలేదు. అయినా కూడా నా వ్యాఖ్యల వల్ల ఇబ్బంది, బాధపడ్డా వారికి నా విచారణం వ్యక్తం చేస్తున్నాను” అంటూ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

 

కాగా ఇటీవల రెట్రో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో విజ్‌ మాట్లాడుతూ.. పహల్గాం దాడిని ఖండించాడు. ఈ క్రమంలో విజయ్‌ మాట్లాడుతూ.. ఇండియా కాప్తిన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నప్రజలకే విరక్తి వచ్చి ఎప్పుడో కాప్‌ ప్రభుత్వంపై తిరగబడారని, 500 ఏళ్‌ల క్రితం ట్రైబల్స్‌ కొట్టుకున్నట్టు.. బుద్ది లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. అనంతరం మనమంతా ఐకమత్యండా ఉండాలని పిలుపునిచ్చాడు. దీంతో విజయ్‌ వ్యాఖ్యలు ట్రైబల్స్‌ని ఉగ్రవాదులతో పోల్చే విధంగా ఉన్నాయని, అతడు తమ వర్గాన్ని అవమానపరిచాడంటూ కిషన్‌రాజ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.