Published On:

Kingdom First Single: హృదయం లోపల వీడియో సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయిందిగా

Kingdom First Single: హృదయం లోపల వీడియో సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయిందిగా

Kingdom First Single: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం తెగ కష్టపడుతున్న విషయం తెలిసిందే. లైగర్ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు సినిమాలు చేశాడు. అవేమీ విజయ్ కు హిట్ ను అందించలేకపోయాయి. ఇక ఈసారి ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

 

అందులో భాగంగానే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ సినిమాను మొదలుపెట్టాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మే 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. కింగ్డమ్ నుంచి  ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. హృదయం లోపల అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను ఏప్రిల్ 30 న సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. అనిరుధ్ అందించిన మ్యూజిక్.. మరోసారి మ్యాజిక్ చేసింది. ప్రోమోతోనే సాంగ్ పై హైప్ తెచ్చిన మేకర్స్ తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. వీడియో సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

 

అనిరుధ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుకున్నట్లుగానే అనిరుధ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. ఇక విజయ్, భాగ్యశ్రీ జంట చూడముచ్చటగా ఉన్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఈ వీడియోలో ఇద్దరు పోలీస్ ఇన్ఫార్మర్స్ గా కనిపించారు. పైకి లవర్స్ గా నటిస్తూ.. విలన్స్ ను ఏరిపారేస్తున్నారు.

 

ఈ సాంగ్ కు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా.. వోకల్స్ ను అనిరుధ్ , అనుమిత  అందించారు. ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మే 30 న కింగ్డమ్ రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతోనైనా విజయ్ భారీ హిట్ ను అందుకుంటాడో .. లేదో చూడాలి.