Published On:

Vijay Devarakonda-Rashmika: గుడ్‌న్యూస్‌.. విజయ్‌-రష్మిక జోడి కన్‌ఫాం! – నిజమే అంటూ హింట్‌ ఇచ్చేసిన నేషనల్‌ క్రష్‌

Vijay Devarakonda-Rashmika: గుడ్‌న్యూస్‌.. విజయ్‌-రష్మిక జోడి కన్‌ఫాం! – నిజమే అంటూ హింట్‌ ఇచ్చేసిన నేషనల్‌ క్రష్‌

Vijay Devarakonda and Rashmika Mandanna Again Paired in VD 14: లైగర్‌, ఖుషి ఫ్లాప్స్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. జాగ్రత్తగా తన సినిమాల ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కింగ్‌డమ్‌ చిత్రంతో బిజీగా ఉన్న ఈరౌడీ హీరో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ చేయబోతున్నాడనే టాక్‌ వినిపిస్తుంది. దీనిపై విజయ్‌ బర్త్‌డే రోజున అధికారిక ప్రకటన రానుందట. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటించనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

 

అయితే ఇప్పుడు దీనిపై మూవీ మేకర్స్‌తో పాటు రష్మిక మందన్నా స్పందించారు. ఏం అర్థంకానీ విధంగా ఓ ట్వీట్‌ వేసి అందరిని అయోమయంలో పడేశారు. దీనికి రష్మిక ఇచ్చిన రిప్లై కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంది. వెండితెరపై విజయ్‌ దేవరకొండ, రష్మిక జోడికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. వీరిద్దరి జంటగా కనిపిస్తే ఆ మ్యాజిక్‌ వేరు అంటారు ఈ జంట ఫ్యాన్స్‌. గీతా గోవిందం సినిమాలో తొలిసారి జంటగా నటించి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు. అప్పటి నుంచి వీరిది హిట్‌ పెయిర్‌గా మారింది.

 

ఆ తర్వాత డియర్‌ కామ్రేడ్‌ మరోసారి జంటగ నటించి ఆడియన్స్‌ని మెప్పించారు. దీంతో మరోసారి వీరిద్దరిని జంటగా వెండితెరపై చూడాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ జోడిని రిపీట్‌ చేయబోతున్నారు మేకర్స్‌. ఇటీవల విజయ్‌ బర్త్‌డే సందర్భంగా VD14 సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.  రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ఇది రూపొందనుంది. అయితే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌, డైరెక్టర్‌ రాహుల్‌లు ఓ ట్వీట్‌ వదిలారు.

 

‘హుమ్‌ చుద్దాం’ అంటూ రష్మిక మందన్నాను ట్యాగ్‌ చేశారు. ఇది చూసి అంత ఆలోచనలో పడ్డారు. ఏమై ఉంటుందా అని అంత అయోమయంలో ఉండగా.. రష్మిక ఈ ట్వీట్‌కి స్పందించింది. ‘హుమ్‌ గాయ్స్‌’ అంటూ రిప్లై ఇచ్చింది. ఇది విజయ్‌ దేవరకొండ (VD14) మూవీ అప్‌డేట్‌ అయ్యుంటుందని, అందులో హీరోయిన్‌గా రష్మికను తీసుకుంటున్నట్టు ఇలా హింట్‌ ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు. అదే విషయాన్ని రష్మిక కూడా ఇన్‌డైరెక్టర్‌గా కన్‌ఫాం చేసిందని అంటున్నారు. మరి దీనిపైక్లారిటీ రావాలంటే విజయ్‌ బర్త్‌డే వరకు వెయిట్‌ చేయాల్సిందే.