Kingdom First Single: రౌడీ హీరో లిప్ కిస్.. హృదయం లోపల ప్రోమో అదిరింది
Kingdom First Single: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. దానికోసమే కష్టపడుతున్నాడు. ఇక అందులో భాగంగానే విజయ్ నటించిన కొత్త చిత్రం కింగ్డమ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.
ఇప్పటికే కింగ్డమ్ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మే 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. వరుస లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. కింగ్డమ్ మొదటి లిరికల్ సాంగ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. హృదయం లోపల అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
విజయ్ దేవరకొండ సినిమా అంటే హీరోయిన్ తో లిప్ కిస్ కచ్చితంగా ఉండాల్సిందే. ఈసారి మొదటి సాంగ్ లోనే ఆ లిప్ కిస్ ను చూపించేశారు. బీచ్ ఒడ్డున భాగ్యశ్రీ.. విజయ్ కు ముద్దు పెట్టడంతో సాంగ్ మొదలయ్యింది. నీ చూపే ఓ నిప్పే.. దూకేశా అందుట్లో ఏముంది నా తప్పే. తూటాలా వర్షాల పువ్వేదో పూసాయే.. లోకంకే చాటేయనా హృదయం లోపల.. అంటూ సాగిన ఈ సాంగ్ అదిరిపోయింది. అనిరుధ్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది.
ఇక విజయ్, భాగ్యశ్రీ కెమిస్ట్రీ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి సాంగ్ మే 2 న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అనిరుధ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రోమో చూస్తుంటేనే ఈ సాంగ్.. చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని అనిపిస్తుంది. మరి ఈ సినిమాతో విజయ్ భారీ హిట్ ను అందుకుంటాడా లేదా అనేది చూడాలి.