Venu Swamy: ప్రభాస్, సమంత, విజయ్ దేవరకొండ చనిపోతారు.. ఒకరు సూసైడ్ చేసుకుంటారు

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలను, రాజకీయ భవిష్యత్ ను చెప్తూ పేరు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు ఈయన జాతకాలను ఎవరు నమ్మేవారు కాదు. కానీ, ఎప్పుడైతే సమంత- నాగ చైతన్య విడిపోతారని.. వారి ఎంగేజ్ మెంట్ అయిన తరువాత చెప్పడం.. నాలుగేళ్ళ తరువాత వారు విడిపోవడం చూసారో.. అప్పటినుంచి వేణుస్వామి మాటలను కొందరు నమ్మడం మొదలుపెట్టారు.
ఇక సినిమా సెలబ్రిటీల విషయంలోనే కాకుండా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని, జగన్ కి మహర్దశ పడుతుందని చెప్పాడు. కానీ, ఆయన చెప్పింది వేరు.. ఇక్కడ జరిగింది వేరు. కూటమి ఓడిపోతుందని నానా మాటలు అనడంతో.. గెలిచాకా కూటమి కార్యకర్తలు వేణుస్వామికి బుద్దిచెప్పారు. దాంతో తాను ఇక రాజకీయాల జోలికి పోను అని మాట ఇచ్చాడు.
సినిమాలు, రాజకీయాలు పక్కన పెట్టి జాతకాలు చెప్పుకుంటున్న వేణుస్వామి.. మధ్యలో టీవీ 5 మూర్తి తమను వేధిస్తున్నాడని డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. దీంతో అది ఇంకా వివాదంగా మారింది. వేణుస్వామి, ఆయనభార్య .. మూర్తి తమను డబ్బుకోసం వేధిస్తున్నాడని, ఇవ్వకపోతే పరువు తీస్తానని బెదిరిస్తున్నాడని చెప్పుకొచ్చారు.
ఇక వేణుస్వామి చెప్పేవన్నీ అబద్దాలు అని.. వారిని తానేమి డబ్బులు అడగలేదని మూర్తి చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వేణుస్వామి సెలబ్రిటీల జాతకాలను ఎంత దారుణంగా చెప్పి డబ్బులు గుంజుతున్నాడో టైమ్ దొరికినప్పుడల్లా చర్చాగోష్ఠి పెట్టి మరీ చూపిస్తున్నాడు. తాజాగా ఒక డిబేట్ లో వేణుస్వామి స్టార్ హీరోస్ ప్రభాస్, విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంతలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
” నేను ఇండస్ట్రీలో ముగ్గురు చనిపోతారని చెప్పాను. ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ చనిపోతారని చెప్పాను. నేను చెప్పింది విజయ్ దేవరకొండ, ప్రభాస్, సమంత. ఎవరన్నా ఒకరు సూసైడ్ చేసుకొని చనిపోతారు. నా లెక్క ప్రకారం అయితే విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకొని చనిపోతాడు. అది బయటకు రావడానికి టైమ్ పడుతుంది. మేనేజ్ చేస్తున్నారు.
రాజాసాబ్ పోస్టుపోన్ అయ్యింది. ప్రభాస్ కు సీరియస్ ఇన్జ్యూరీ అయ్యింది. అందుకే పోస్టుపోన్ అవుతుంది. ఇంకా చాలా ప్రాబ్లెమ్స్ ఉన్నాయి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వేణుస్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు వేణుస్వామిపై ఫైర్ అవుతున్నారు.