Vijay Sethupathi: విజయ్ సేతుపతి ‘ఏస్’.. వచ్చేది ఎప్పుడంటే.. ?

Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రం ఏస్. అరుముగ కుమార్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా.. యోగి బాబు, పి.ఎస్. అవినాష్ మరియు బబ్లూ పృథివీరాజ్ సహాయక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఏస్ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మే 23 న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ సేతుపతి గన్ కాలుస్తూ సీరియస్ గా కనిపించాడు. ఇదొక యాక్షన్ కామెడీ చిత్రమని సమాచారం. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం త్వరలోనే ప్రెస్ మీట్ ను కూడా పెట్టనుంది. ఇక ఈ సినిమాతో పాటు విజయ్ సేతుపతి నటిస్తున్న మరోచిత్రం పూరిసేతుపతి.
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూసి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి,ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటియూ టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ మీద ఉంది. వరుస ప్లాప్స్ లో ఉన్న పూరి సినిమాను విజయ్ ఒప్పుకోవడమే పెద్ద విషయం.
ఇక ఇదే విషయాన్నీ కొంతమంది విజయ్ సేతుపతిని అడగగా.. తాను అలాంటివేమీ పట్టించుకోనని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ తో భారీ పరాజయాన్ని అందుకున్న పూరి.. ఈ సినిమాతోనైనా గట్టెక్కుతాడా.. ? అని అందరు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
BrACE yourself – The ultimate action spectacle is here #ACE hits theatres on May 23 – Prepare for the Ride of 2025! #ACEFromMay23@rukminitweets @7CsPvtPte @Aaru_Dir @iYogiBabu @justin_tunes @samcsmusic @shreyaghosal @KapilKapilan_#KaranBRawat @andrews_avinash @rajNKPK… pic.twitter.com/DZk4coWcMJ
— VijaySethupathi (@VijaySethuOffl) April 19, 2025