Raj Tarun- Lavanya Case: రాజ్ తరుణ్ నన్ను చంపాలని చూస్తున్నాడు.. లావణ్య సంచలన వ్యాఖ్యలు

Raj Tarun- Lavanya Case: హీరో రాజ్ తరుణ్.. షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా మారాడు. విజయాపజయాలను పట్టించుకోకుండా ఇండస్ట్రీలో కుర్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న నేపథ్యంలోనే అతడి పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీని ఊపేసేలా చేసింది లావణ్య. రాజ్ తరుణ్ భార్య అంటూ ఆమె పోలీసులను ఆశ్రయించడంతో మొదలైన వివాదం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రాజ్ తరుణ్.. తనను ప్రేమించి, పెళ్లి చేసుకొని మోసం చేశాడని ఆమె ఆరోపించింది. అందుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు అన్ని ఒకప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసాయి.
ముఖ్యంగా లావణ్య.. మస్తాన్ సాయి అనే వ్యక్తితో మాట్లాడిన ఆడియో టేప్స్ అయితే భీబత్సం సృష్టించాయి. ఇక ఈ కేసుపై రాజ్ తరుణ్ లీగల్ గానే వెళ్తానని, తానేమి తప్పు చేయలేదని, ఒకానొక సమయంలో లావణ్యతో రిలేషన్ లో ఉన్న విషయం విదితమే కానీ.. ఆమె పద్దతి నచ్చక బ్రేకప్ చెప్పినట్లు చెప్పుకొచ్చాడు. అయినా లావణ్య మాత్రం రాజ్ తరుణ్ పరువు ఎంతవరకు తీయాలో అంతవరకు తీసేసి చివరకు.. తనది తప్పే అని, తనను క్షమించమని అడిగింది.
ఇక్కడితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది అనుకుంటే.. తాజాగా లావణ్య మరోసారి రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్, అతడి ఫ్రెండ్ శేఖర్ భాషా ఇద్దరు కలిసి తనను చంపాలని చూస్తున్నారని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం మరోసారి సంచలనం సృష్టించింది. ” ప్రస్తుతం మా కేసు కోర్టులో నడుస్తోంది. నాకు ప్రాణహాని ఉంది. ఈమధ్యనే నాపై దాడికి ప్రయత్నాలు జరిగాయి. ఒక నలుగురు మహిళలు నా ఇంట్లోకి చొరబడాలని చూసారు. దయచేసి నాకు రక్షణ కల్పించండి. నేను ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నా ప్రాణం పోయేవరకు అలానే చూస్తూ ఉంటారా.. ?.
నాలుగేళ్ళ క్రితం నేను, రాజ్ తరుణ్ కలిసి ఒక వ్యక్తి దగ్గర రూ. 55 లక్షలు తీసుకున్నాము. కొంతవరకు కట్టాం.. ఈ గొడవల వలన రెండేళ్లుగా వడ్డీ కూడా కట్టడం లేదు. ఈ మధ్యనే ఆ వ్యక్తి నాకు కాల్ చేసి డబ్బులు కట్టమని, లేకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటానని అంటున్నాడు. నా దగ్గర అంత డబ్బు లేదు. ఇప్పుడు ఆ డబ్బు రాజ్ తరుణ్ కట్టినా.. అతనికి ఇల్లు పూర్తిగా చెందదు. ఎందుకంటే ఆ ఇంట్లో నాకు వాటా ఉంది. ఇప్పటివరకు ఈ విషయమై రాజ్ తరుణ్ నాతో మాట్లాడలేదు. ఇంకా నన్ను వేదించాలని, నా పరువుకు భంగం కలిగించాలని చూస్తున్నాడు. తన ఫ్రెండ్ శేఖర్ భాషాతో కలిసి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.