Published On:

Samantha: ఏ మాయ చేసావే – నా యాక్టింగ్‌ చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది: సమంత షాకింగ్‌ కామెంట్స్‌

Samantha: ఏ మాయ చేసావే – నా యాక్టింగ్‌ చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది: సమంత షాకింగ్‌ కామెంట్స్‌

Samantha Shocking Comments on Her Acting: రెండు దశాబ్దాలుగా సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగింది సమంత. ఆమె పేరు వినగానే వెంటనే ఏం మాయా చేశావే సినిమా గుర్తోస్తుంది. ఈ చిత్రంతోనే ఆమె తెలుగులో అడుగుపెట్టింది. ఫస్ట్‌ చిత్రంతోనే ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయింది. ఇందులో ఆమె పోషించిన జెస్సీ పాత్రకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ముఖ్యంగా యువతను ఈ పాత్ర బాగా ఆకట్టుకుంది. ఇందులో సామ తన తన నటనతో విమర్శకులు ప్రశంసలు అందుకుంది.

 

కానీ, ఈ సినిమాలో తను చాలా అసహ్యంగా నటించానంటూ షాకింగ్ కామెంట్స్‌ చేసింది. కొత్త టాలెంట్‌, మంచి కథలను ఇండస్ట్రీకి అందించాలనే ఉద్దేశంతో సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె నిర్మాణంలో తొలి చిత్రంగా శుభం రూపొందింది. వచ్చే నెలలో ఈచిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ భాగంగా సమంత శనివారం సాయంత్ర ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న సమంత స్టేజ్‌పై మాట్లాడుతూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఈ మేరకు శుభం మూవీ నటీనటులపై ప్రశంసలు కురిపించింది. “తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కంటెంట్‌కు పెద్ద పీట వేస్తారు. మంచి కథ ఉన్న చిత్రాలను వారు ఆదరిస్తుంటారు.

 

మా సినిమా నటీనటులందరూ కొత్తవారే అయినప్పటికీ అద్భుతంగా నటించారు. వారి నటన నాకెంతో నచ్చింది. నటిగా నా కెరీర్‌ మొదలుపెట్టినప్పుడు యాక్టింగ్‌ గురించి పెద్దగా తెలియదు. నా తొలి రెండు సినిమాల్లో నా యాక్టింగ్‌ చూస్తే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. అవి చూసినప్పుడల్లా ఇంత అసహ్యంగా నటించానా! అనిపిస్తుంది. ఇంకా బాగా నటించవచ్చు కదా అనుకుంటాను. కానీ, వీళ్లు అలా కాదు. వారికిది తొలి సినిమానే అయినా చాలా బాగా యాక్ట్‌ చేశారు” అంటూ సమంత చెప్పుకొచ్చింది. నిర్మాతగా మారడంపై సామ్‌ స్పందించింది. జీవితంలో సవాళ్లను స్వీకరించడం తనకు ఇష్టమని, నిర్మాతగా ఇదొక కొత్త ప్రయాణమని అన్నారు.