Published On:

Pavani Reddy: రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..

Pavani Reddy: రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..

Pavani Reddy: తెలుగు నటి పావని రెడ్డి ఎట్టకేలకు కోరుకున్న ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకుంది. కొరియోగ్రాఫర్ అయిన అమీర్ తో ఆమె వివాహం నేడు చెన్నైలోని ఒక రిసార్ట్ లో గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పావని.. తెలుగు సీరియల్స్ తో కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె.. హీరోయిన్ గా వెండితెరపై కూడా కూడా కనిపించింది. గౌరవం, అమృతంలో చందమామ, చార్లీ 111 లాంటి సినిమాలో పావని నటించి మెప్పించింది.

 

2017 లో పావని.. మరో సీరియల్ నటుడు ప్రదీప్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట కాపురంలో ఎలాంటి కలతలు రేగాయి తెలియదు కానీ, కొన్నేళ్ళకే ప్రదీప్ ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఇక భర్త మరణంతో కుంగిపోయిన పావని.. తెలుగు ఇండస్ట్రీని వదిలి చెన్నైకు వెళ్ళింది. అక్కడే తమిళ్ సీరియల్స్, సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకొని,  ఆ గుర్తింపుతో తమిళ్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఆ హౌస్ లోనే పావనికి కొరియోగ్రాఫర్ ఆమీర్ పరిచయమయ్యాడు. ఇక షోలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్లు డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇరువర్గాల కుటుంబాలను ఒప్పించి నేడు పెళ్లితో ఒక్కటయ్యారు.

 

దాదాపు మూడేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట ఎన్నో షోస్ లలో కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ హౌస్ లో ప్రేమలు అక్కడివరకే కానీ, బయట అలాంటివి ఉండవు అని ఎంతోమంది వీరి రిలేషన్ ను ట్రోల్ చేశారు. చివరికి ఆ ట్రోల్స్ ను లెక్కచేయకుండా ఈ జంట తమ ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లారు. ఇక వీరి పెళ్లి ఫోటోలు చూసిన అభిమానులు కంగ్రాట్స్ చెప్పుకొస్తున్నారు. వీరు నిండు నూరేళ్లు సంతోషంగా బతకాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.