Trump on India Pakistan War: కశ్మీర్ పరిష్కారానికి భారత్-పాక్‌తో కలిసి పనిచేస్తా: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

US President Donald Trump on India Pakistan Relation: భారత్-పాక్ యుద్ధానికి విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ రెండు దేశాలతో కలిసి కశ్మీర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో మరణాలు, విధ్వంసం తప్పే ఏమి లేవని భారత్-పాక్‌లోని శక్తిమంతమైన నాయకత్వాలు అర్థం చేసుకున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. లక్షల మంది అమాయక పౌరులు చనిపోవచ్చు అని తెలిపారు. రెండు దేశాలు చారిత్రక నిర్ణయం తీసుకోవడానికి అమెరికా సాయం చేసినందుకు గర్వంగా ఉందని చెప్పారు. కేవలం చర్చించడమే కాదు.. ఇరుదేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పరిష్కారాన్ని రెండు దేశాలు కనుక్కోగలిగితే, మీతో కలిసి పనిచేస్తానని డొనాల్డ్ ట్రంపు ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
డొనాల్డ్ ట్రంపు తన తొలి విడుత పాలన సమయంలో కూడా కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధపడ్డారు. నాటి పాకిస్థాన్, భారత్ ప్రధాన మంత్రుల దగ్గర దీన్ని గురించి ప్రస్తావించారు. కానీ, న్యూఢిల్లీ నాడు తృతీయ పక్షం జోక్యాని సున్నితంగా తిరస్కరించింది. దీంతో ట్రంపు ఈ విషయంలో పెద్దగా వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా కాల్పుల విరమణ విషయంలో రెండు దేశాలు అవగాహనకు వచ్చాయని ట్రంప్ తొలుత ట్రూత్ పోస్ట్‌లో వెల్లడించారు. ఆ తర్వాత భారత్-పాకిస్థాన్‌లు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాయి. భారత్ ప్రకటనలో మాత్రం ట్రంపు పాత్రను ఈ అంశంలో అసలు ప్రస్తావించలేదు.