Priyadarshi: ఆ సినిమా ఒప్పుకోవడం ఒక చెత్త నిర్ణయం.. ప్రియదర్శి సంచలన వ్యాఖ్యలు

Priyadarshi: కమెడియన్ ప్రియదర్శి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కౌశిక్ అంటే టైమ్.. టైమ్ అంటే కౌశిక్. నా చావు నేను చస్తా నీకెందుకు అంటూ పెళ్ళి చూపులు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ప్రియదర్శి. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. ఆ గుర్తింపుతో బలగం సినిమాతో హీరోగా మంచి హిట్ ను అందుకున్నాడు.
ఇక బలగం సినిమా ప్రియదర్శి జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమా తరువాత హీరోగానే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్యనే కోర్ట్ సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు సారంగపాణి జాతకం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సారంగపాణి జాతకం.
శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన ప్రియదర్శి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ మారాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియదర్శి తన మనోగతాన్ని బయటపెట్టాడు.
” ఇండస్ట్రీకి నేను కమెడియన్ అవ్వాలని రాలేదు. అసలు కమెడియన్ అవ్వాలని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే వెన్నెల కిషోర్, సత్య లా నేను కామెడీ చేయలేను. కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ లా సంపూర్ణ నటుడు అవ్వాలని కోరుకున్నాను. వారిని చూసే ఇండస్ట్రీకి వచ్చాను. నా తొమ్మిదేళ్ళ కెరీర్ లో నేను సంతృప్తి చెందలేదు. ఇంకా ఏదో చేయాలని తపనే ఎక్కువగా ఉంది.
నా కెరీర్ లో కోర్ట్ సినిమా ఒప్పుకోవడం నేను తీసుకున్న అతిపెద్ద మంచి నిర్ణయం అని చెప్తాను. ఇక నేను తీసుకున్న చెత్త నిర్ణయం ఏంటి అంటే.. మిఠాయి సినిమాను ఒప్పుకోవడం. అది డైరెక్టర్ కూడా చాలా లైట్ తీసుకొని చేశాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో ప్రియదర్శి ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.