Manchu Vishnu: ‘కన్నప్ప’ కోసం ప్రభాస్, మోహన్ లాల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?
![Manchu Vishnu: ‘కన్నప్ప’ కోసం ప్రభాస్, మోహన్ లాల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/prabhas-and-mohan-lal.jpg)
Prabhas Remuneration For Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. అవ ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లో మంచు మోహన్ బాబు ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు ప్రమోషన్స్‌ని కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా నటీనటుల పాత్రలు, ఫస్ట్‌లుక్‌లను రిలీజ్ చేస్తోంది మూవీ టీం.
ఇక రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి శివ శిశ శంకర పాటను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక మూవీ ప్రమోషన్స్ జోరు పెంచిన విష్ణు వరుస ఇంటర్య్వూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు నటీనటులు పారితోషికాలను రివీల్ చేశాడు. కన్నప్పు కోసం సుమారు ఏడేళ్ల నుంచి వర్క్ చేస్తున్నామన్నాడు. దాదాపు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మితమవుతోందని చెప్పాడు.
“నిజానికి కన్నప్పలో నటీనటుల పారితోషికంతో కలుపుకుంటే సినిమా బడ్జెట్ భారీగా పెగాలి. కానీ చాలా మంది పారితోషికం లేకుండానే నటించారు. ప్రభాస్, మోహన్ లాల్‌లు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కన్నప్పలో వీరిద్దరి పాత్రలు చాలా కీలకం. వీరికి కన్నప్ప కథ చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నారు. ప్రభాస్ అయితే సినిమా ఎప్పుడు స్టార్ట్ అని అడిగాడు. ఇక మోహన్ లాల్ దగ్గరికి వెళ్లి కథ చెప్పి రెమ్యునరేషన్ గురించి మీ మేనేజర్‌తో మాట్లామంటారా అని అడిగారు.
అప్పుడే అంత పెద్దోడివి అయిపోయావా అన్నారు. నాన్నగారు (డా. మోహన్ బాబు) మీద అభిమానంతో నటిస్తున్నారు. ఈ సినిమా ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. ఇక ప్రభాస్ నాకు మంచి స్నేహితుడు. ఆ స్నేహంతో కన్నప్ప కోసం ఎలాంటి పారితోషికం లేకుండా నటిస్తున్నాడు. ప్రభాస్ వల్ల స్నేహంపై నాకు నమ్మకం పెరిగింది. కన్నప్పలో శివుడి పాత్ర కోసం అక్షయ్ కుమార్‌ని సంప్రదించాం. ఆయన రెండు సార్లు ఈ సినిమా తిరస్కరించారు. తర్వాత వేరే డైరెక్టర్‌తో చెప్పించి ఒప్పించాం. ఆయన చాలా అద్బుతంగా నటించారు” అని విష్ణు చెప్పుకొచ్చాడు.