Jayam Ravi: సానుభూతి కోసం నా పిల్లలను సాధనంలా వాడుకుంటుంది – భార్య ఆర్తిపై జయం రవి సంచలన వ్యాఖ్యలు

Jayam Ravi Shared a Note on Wife Aarti Allegations: కోలీవుడ్ నటుడు ‘జయం’ రవి మోహన్ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తుంది. తన వ్యక్తిగత విషయాలతో అతడు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతేడాది తన భార్యతో విడిపోతున్నట్టు ప్రకటించిన సంగత తెలిసిందే. సింగర్ కన్నీషాతో సంబంధం వల్లే భార్యకు విడాకులు ఇస్తున్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. ఇటీవల ఓ పెళ్లి వేడుకల్లో ఇద్దరు జంటగా కనిపించడంతో మరోసారి జయం రవి పర్సల్ లైఫ్ హాట్ టాపిక్ అయ్యింది.
కష్టపడి కెరీర్ ని నిర్మించుకున్నా..
వారిద్దరి ఫోటో బయటకు రాగానే… అతడి భార్య ఆర్తి రవి సుధీర్ఘ పోస్ట్ పెట్టాడు. తనని ఇంటి నుంచి గెంటేశాడని.. పిల్లలను అస్సలు పట్టించుకోవడం లేదని, కనీసం ఆర్థికంగా కూడా ఎలాంటి సాయం లేదంటూ విమర్శలు చేసింది. దీనిపై జయం రవి స్పందిస్తూ సుధీర్ఘ పోస్ట్ పెట్టాడు. రవి తన లేఖలో రాస్తూ.. “కష్టపడి, ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ స్వయం శక్తితో కెరీర్‌ని నిర్మించుకున్నా. వ్యక్తిగత లాభం, చౌకబాఉ సానుభూతి పొందడం కోసం గత వివాహ బంధాన్ని ఉపయోగించను. ఇదేం ఆట కాదు. ఇది నా జీవితం. చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా కట్టుబడి ఉన్నా. ఇన్నేళ్లు నా సొంత తల్లదండ్రులను కూడా కలుసుకోలేకపోయాను.
మా బంధాన్ని కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నించా
మానసికంగా, ఎమోషనల్‌గా చివరిక ఆర్థిక పరమైన వేధింపుల గురయ్యాను. అయినా నా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. ఆర్తితో ఉన్నప్పుడు పంజరంలో ఉన్నట్టు అనిపించింది. దీంతో ఆ బంధం నుంచి బయటకు రావాలనుకున్నా. ఎంతో ఆలోచించి ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ విడాకులు నిర్ణయంపై ఇప్పటికే నా తల్లిదండ్రులతో మాట్లాడాను. అయితే ఇప్పుడు ఈ విషయంలో మౌనంగా ఉండటం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇటీవల ఓ కార్యక్రమం తర్వాత నన్ను తక్కువ చేసేలా ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. వాటిని నేను ఖండిస్తున్నా. నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది.
కెన్నిషా అందమైన భాగస్వామి..
ఆర్థిక లాభం, ప్రజల సానుభూతి కోసం నా పిల్లలను ఒక సాధానంగా వాడుకోవడం చూస్తుంటే నాకేంతో బాధగా ఉంది. ఆర్తి, కుటుంబానికి ఎంతో సపోర్టు చేశా. నా పిల్లలు వదిలేయాలని నేనేప్పుడు అనుకోలేదు. వాళ్ల కోసమే జీవిస్తున్నా” అంటూ పేర్కొన్నాడు. అలాగే తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ కెన్నిషా గురించి ప్రస్తావిస్తూ.. “మా పరిచయం స్నేహితులుగానే మొదలైంది. నిరాశ, కన్నీళ్లు, బాధలో ఉన్న నాకు ఆమె ఎంతో సపోర్టుగా నిలిచింది. కట్టుబట్టలతో ఒక రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన సమయంలో తనే నాకు అండగా నిలిచింది. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె వెనుకాడలేదు. ఆమె ఒక అందమైన భాగస్వామి” అని రాసుకొచ్చాడు.
View this post on Instagram