Samantha: రాజ్ నిడిమోరుతో సమంత రెండో పెళ్లి రూమర్స్ – క్లారిటీ ఇచ్చిన సామ్ మేనేజర్

Samantha Team Reacts On Dating Rumours: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్‌లో ఉందని, త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తను నిర్మించిన శుభం మూవీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా సమంత వరుస పోస్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్ నిడిమోరుతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఆయన భుజంపై తల పెట్టి సెల్ఫీ తీసుకున్న ఫోటోని షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.
రాజ్‌తో డేటింగ్ ఉన్నట్టు సామ్ ఇలా హింట్ ఇచ్చిందంటూ కథనాలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ వార్తపై సమంత మేనేజర్ స్పందించారు. రాజ్ నిడిమోరుతో పెళ్లంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. “డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్ని వట్టి పుకార్లు మాత్రమే. సమంత నిర్మింఇచన శుభం మూవీ ప్రమోషన్స్‌లో సమయంలో తీసిన ఫోటోలను ఆధారంగా చేసుకుని ఇలా తప్పుడ వార్తలు సృష్టిస్తున్నారని ఈ రూమర్స్‌ని ఖండించారు. అలాగే సమంత రాజ్ నిడిమోరు తన కూతురితో కలిసి ఉండాలనుకుంటున్నారంటూ వస్తున్న వార్తలు సైతం అబద్ధమని తేల్చారు.
అసలు రాజ్ నిడిమోరుకు కూతురు లేదని, ఆయనతో కనిపించిన అమ్మాయి.. మరో డైరెక్టర్ డికే కూతురని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాజ్ నిడిమోరు తన భార్య శ్యామాలి త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. మరి ఇప్పటికైన ఈ పుకార్లకు చెక్ పడుతుందా లేదా చూడాలి. కాగా దర్శక ద్వయం రాజ్ అండ్ డికే సంయుక్తంగా తెరకెక్కించి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో సమంత నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి డైరెక్టర్ సామ్‌కు పరిచయం ఉంది. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇండియా వెర్షన్ ‘సిటాడెల్: హనీ బన్నీ’లో నటించారు. అలాగే ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రాజ్ అండ్ డికే దర్శకత్వంలోనే రూపొందబోతోంది.