Spotify: స్పాటిఫై కీలక నిర్ణయం – పాకిస్తాన్ పాటలు డిలీట్!

Spotify Removed All Pakistani Songs: ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫాం సంస్థ స్పాటిఫై కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా-పాకిస్తాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాక్ సదరు సంస్థ షాక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన పాటలను ప్లాట్‌ఫాం నుంచి తొలగించింది. భారత ప్రభుత్వ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, మీడియా స్ట్రీమింగ్ సేవలు డిజిటల్ ప్లాట్‌ఫాంలోని పాక్‌కు సంబంధించిన సినిమాలు, పాటలు, వెబ్ సిరీస్‌లు, పాడ్‌కాస్ట్ ఇతర కంటెంట్‌ను తొలగించాలని కేంద్ర ఆదేశించిన సంగతి తెలిసిందే.
దీంతో స్పాటిఫై సైతం పాక్ పాటలను తన ప్లాట్‌ఫామ్ నుంచి డిలీట్ చేసింది. దీంతో పాకిస్తాన్‌కు చెందిన ఫేమస్ ‘జోల్’, ‘మాండ్’ అనే పాటలను స్పాటిఫై నుంచి తొలగించారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ సినిమా విడుదలను నిలిపివేశారు. ఆ తర్వాత ఇండియా-పాక్ వార్‌లో నేపథ్యంలో పాకిస్తాన్ నటీనటులకు సంబంధించిన సినిమాలపై బ్యాన్ విధించారు. ‘ఆపరేషన్ సిందూర్’పై వారు చేసిన కామెంట్స్ నేపధ్యంలో పాక్ నటీనటులపై కూడా భారత్ బ్యాన్ విధించింది. అలాగే మావ్రా హోకేన్, మహిరా ఖాన్ సినిమాలైన సనమ్ తేరి కసమ్, రయీస్ చిత్రాల పోస్టర్లను సైతం తొలగించారు.