Samantha-Raj Nidimoru Dating: రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో – డైరెక్టర్ భార్య షాకింగ్ పోస్ట్

Director Raj Nidimoru Wife Shared Shocking Post: హీరోయిన్ సమంత, ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. అయితే ఇంతవరకు ఈ రూమర్స్‌పై సమంత స్పందించలేదు. పైగా తరచూ ఆయనతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఇక రిసెంట్‌గా అయితే ఏకంగా రాజ్ నిడిమోరు భుజంపై తల వాల్చిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
దీంతో ఈ ఫోటో ప్రస్తుత పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్టైయింది. వారి రిలేషన్‌పై సమంత ఇలా హింట్ ఇస్తుందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత ఈ ఫోటో షేర్ చేసిన కొంత సమాయానికి రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో “నాకు కృతజ్ఞతలు చెప్తున్న ప్రతిఒక్కరికి ప్రేమ, ఆశీర్వాదాలు పంపుతున్నాను’ అని ఉంది.
అలాగే నా కోసం ఆలోచించేవారికి, నా గురించి రాసేవారికి, నా తరుపున మాట్లాడేవారికి, నా గురించి మాట్లాడేవారికి నేను చెప్పేది వినేవారికి, నా గురించి వార్తలు వినేవారికి ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి సోషల్ మీడియాలో శ్యామాలి చాలా అరుదుగా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఆమె సామాజీక మాధ్యమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి తరుణంలో సమంత పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే శ్యామాలి పోస్ట్ పెట్టడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఇది సామ్, రాజ్ నిడిమోరు ఉద్దేశించే పెట్టిందని అంతా సందేహిస్తున్నారు. కాగా రాజ్ నిడిమోర, శ్యామిలిల వివాహం 2025లో జరిగింది. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. పెళ్లికి ముందు శ్యామాలి బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాశ్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్ దర్శకురాలిగా పనిచేశారు. పెళ్లి తర్వాత రాజ్ రూపొందించిన చిత్రాలకు సంబంధించి ఆమె క్యాస్టింగ్‌లో సాయం చేస్తుండేది. అయితే కొంతకాలంగా వీరి వైవాహిక జీవితంలో కలతలు వచ్చాయని, త్వరలోనే వారిద్దరు విడాకులు తీసుకుంటున్నారని బి-టౌన్‌లో ప్రచారం కూడా ఉంది.