RAPO22 Title Glimpse: ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. రాపో22 టైటిల్ గ్లింప్స్ రిలీజ్- ఈసారి ఫ్యాన్స్‌కి మాస్ జాతరే

Ram Pothineni RAPO22 Movie Title Glimpse Release: ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని, పి. మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాపో22(RAPO 22) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రకటించారు. ఇందులో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న టైటిల్‌ని ఫిక్స్ చేశారు.
ఈ సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ టైటిల్ ఖారారు చేసి తాజాగా ప్రకట్టించారు. ఈమేరకు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఊరమాస్ లుక్‌లో అలరించిన రామ్ ఈసారి ఫ్యాన్‌గా కనిపించబోతున్నాడు. ఓ అభిమాని బయోపిక్ అని పోస్టర్ పేర్కొన్నారు. ఇందులో రామ్‌ని చూస్తుంటే మళ్లీ తన పాత రూట్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే రామ్ డెబ్యూ మూవీ దేవదాస్, జగడం, రెడీ చిత్రాలను తలపిస్తున్నట్టు కనిపిస్తోంది.