Published On:

Anand Devarakonda New Movie: హిట్‌ జోడి రిపీట్‌ – ఆనంద్‌ దేవరకొండ సినిమాకు క్లాప్‌ కొట్టిన రష్మిక

Anand Devarakonda New Movie: హిట్‌ జోడి రిపీట్‌ – ఆనంద్‌ దేవరకొండ సినిమాకు క్లాప్‌ కొట్టిన రష్మిక

Anand Devarakonda and Vaishnavi Chaitanya New Movie Starts: హిట్‌ జోడి మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది. బేబీ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యలు మరోసారి జంటగా కనువిందు చేయబోతున్నారు. వారిద్దరు హీరోహీరోయిన్లుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో ఓ సినిమా రానుంది. తాజాగా ఈ సినిమా ప్రకటించింది. ప్రొడక్షన్‌ నెం.32గా తెరకెక్కబోయే ఈ సినిమా నేడు హైదరాబాద్‌లో పూజ కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

ఈ కార్యక్రమంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిగా హాజరైన ఆమె ముహుర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ తాజాగా ఎక్స్‌లో షేర్‌ చేసింది. కాగా ఈ కార్యక్రమంలో రష్మిక మందన్నా క్లాప్‌ కొట్టగా.. శివాజీ కెమెరా స్విచాన్‌ చేశారు. డైరెక్టర్‌ వెంకీ అట్లూరి, కళ్యాణ్‌ శంకర్‌లు స్క్రిప్ట్‌ అందించారు. జూన్‌లో రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుందని, ఇందుకు సంబంధించిన ప్రకటనను త్వరలోనే ఇస్తామని పేర్కొంది. ఈ సినిమాకు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందిస్తున్నారు.

 

ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలోని తారగణంతో పాటు మరిన్ని వివరాలు మూవీ టీం ప్రకటించనుంది. కాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా డేటింగ్ ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అవి నిజమే అన్నట్టు వీరిద్దరు తరచూ లంచ్, డిన్నర్ డేట్స్.. జంటగా వెకేషన్ లో కనిపిస్తున్నారు. ఇవి ఆ రూమర్స్ కి మరింత ఆజ్యం పోస్తున్నాయి. అంతేకాదు తరచూ విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కూడా కనిపిస్తూ ఉంటుంది. పండగలు వస్తే చాలు రష్మిక విజయ్ ఇంట్లో వాలిపోతుంది. మరోవైపు ఆనంద్ దేవరకొండకు సంబంధించిన ప్రతి సినిమా ఈవెంట్లోనూ రష్మిక మెరుస్తుంది. ఇప్పుడు తాజాగా అతడి కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథి హాజరవ్వడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.