Published On:

Shine Tom Chacko Arrest: డ్రగ్స్ కేసు.. దసరా విలన్ అరెస్ట్

Shine Tom Chacko Arrest: డ్రగ్స్ కేసు.. దసరా విలన్ అరెస్ట్

Shine Tom Chacko Arrest: ఎట్టకేలకు మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నిరోజుల క్రితం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ఫొకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ చట్టం కింద శనివారం చాకోను కొచ్చి  పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం కొచ్చిలోని ఒక హోటల్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోదా చేయగా.. మూడో అంతస్తులో చాకోను ఉన్నాడు. పోలీసులను చూడడంతో.. వెంటనే అతను మూడో అంతస్తు కిటికీ నుంచి దూకి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.

 

ఇక నేడు చాకోను పోలీసులు విచారణకు పిలిచి.. నాలుగు గంటలు విచారించారు. అనంతరం అతడిని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ఫొకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ చట్టం కింద అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట  వైరల్ గా మారింది. ఇకపోతే షైన్ టామ్ చాకో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. అవ్వడానికి మలయాళ నటుడే కానీ, అతడి నటనతో అన్ని  ఇండస్ట్రీలో అడుగుపెట్టి అభిమానులను సంపాదించుకున్నాడు.

 

తెలుగులో దసరా సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ద్వారా చాకో తెలుగువారికి సుపరిచితుడుగా మారాడు. ఆ తరువాత దేవర సినిమాలో కూడా నయించి మెప్పించాడు. సినిమాల విషయం పక్కన పెడితే చాకో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం.. ఇలా అరెస్ట్ అవ్వడం కొత్తేమి కాదు. గతంలో కూడా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కున్నాడు. మలయాళ ఇండస్ట్రీలో ఇతడు పిచ్చోడు అని అంటారు.

 

ఇంటర్వ్యూలకు వెళ్లి.. యాంకర్స్ తో అసభ్యంగా ప్రవర్తించడం, ఫోన్లు విసిరేయడం.. ఇలాంటి పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న షైన్.. ఇలా అరెస్ట్ అవ్వడం మలయాళ ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. మరి ఈ అరెస్ట్ పై మలయాళ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.