Last Updated:

Ram Charan: అబ్బబ్బా.. ఏమున్నాడ్రా బాబు.. బుచ్చిబాబు నీకు గుడి కట్టినా తప్పులేదయ్యా

Ram Charan: అబ్బబ్బా.. ఏమున్నాడ్రా బాబు.. బుచ్చిబాబు నీకు గుడి కట్టినా తప్పులేదయ్యా

Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ కాస్తా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.పాన్ ఇండియా రేంజ్ లో చరణ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆర్ఆర్ఆర్ తరువాత సోలో హీరోగా ఈ ఏడాది గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.  ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్  భారీ పరాజయాన్ని అందుకుంది.

 

ఇక గేమ్ ఛేంజర్  ప్లాప్ నుంచి కోలుకోవడానికి ఫ్యాన్స్ కు ఒక మంచి సినిమా కావాలి దానికోసమే డైరెక్టర్ బుచ్చిబాబు రంగంలోకి దిగాడు. రామ్ చరణ్ తో బుచ్చిబాబు చేస్తున్న చిత్రం RC16.  ఉప్పెన లాంటి హిట్ సినిమా తరువాత బుచ్చిబాబు.. కొద్దిగా గ్యాప్ తీసుకొని ఒక మంచి కథతో వస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ నటిస్తోంది.

 

గతేడాదిలోనే RC16 పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ మధ్యనే సెట్స్ మీదకు కూడా వెళ్లిన ఈ సినిమా కోసం చరణ్ బాగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. చరణ్ కెరీర్ లో రంగస్థలం తరువాత ఆ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. RC16 కోసం చరణ్ మేకోవర్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. హెయిర్, జుట్టు పెంచేసి.. రంగస్థలం చిట్టిబాబులా మారిపోయాడు.

 

తాజాగా రామ్ చరణ్.. హైదరాబాద్ లో జరిగిన ఒక వెడ్డింగ్ ఈవెంట్ లో సందడి చేశాడు. సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ పెళ్లి వేడుకకు అటెండ్ అయ్యారు. ఇక భార్య ఉపాసనతో కలిసి చరణ్ కూడా హాజరయ్యాడు. బ్లాక్ అండ్ బ్లాక్ సూట్.. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ అన్ని ఒక ఎత్తు అయితే.. వైట్ కళ్లద్దాలు చరణ్ లుక్ ను ఇంకా క్లాస్ గా మార్చాయి.

 

ఆఫ్ స్క్రీన్ లో చరణ్ లుక్స్ ను కొట్టేవారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం చరణ్ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక చరణ్ లుక్ ను చూసి మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అబ్బబ్బా.. ఏమున్నాడ్రా బాబు.. బుచ్చిబాబు నీకు గుడి కట్టినా తప్పులేదయ్యా  అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.