Shiva Rajkumar Visit Temple: పెద్దమ్మ తల్లి టెంపుల్‌ని సందర్శించిన స్టార్ శివరాజ్ కుమార్ – ఫోటో వైరల్

Shiva Rajkumar Visit Peddamma Thalli Temple: కరుణాడ చక్రవర్తి, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హైదరాబాద్ వచ్చారు. రామ్ చరణ్ ఆర్‌సీ 16 మూవీ షూటింగ్ నేపథ్యంలో భార్యతో కలిసి శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బంజాహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి గుడిని సందర్శించారు. తన సతీమణితో కలిసి ఆయన ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ సిబ్బంది శివరాజ్ కుమార్, ఆయన భార్యకు తీర్థ ప్రసాదాలు అందించారు. శివరాజ్ కుమార్‌ను చూసేందుకు అక్కడికి వచ్చిన భక్తులు ఆసక్తి చూపించారు.
ఆయన ఫోటోలు, సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు. కాగా త్వరలోనే శివరాజ్ కుమార్ ఆర్‌సీ 16 సెట్‌లో అడుగుపెట్టనున్నారు. కాగా ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో గోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో శివరాజ్ కుమార్ ఓ కీ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇటీవల ఆయనకు మూవీ టీం లుక్ టెస్ట్ నిర్వహించి ఫైనల్ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కబోతోంది.