Last Updated:

RC 16: ఆర్సీ16 లో చిరంజీవి భార్య కూడా.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ బుచ్చి మావా..?

RC 16: ఆర్సీ16 లో చిరంజీవి భార్య కూడా.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ బుచ్చి మావా..?

RC 16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RC16 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ తరువాత గేమ్ ఛేంజర్ తో మంచి హిట్ అందుకోవాలని చూసాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్నాడు అంటే.. ఆ సినిమా ఒక భారతీయుడు, ఒక జెంటిల్ మ్యాన్ లా ఉంటుంది అనుకున్నారు. ఎన్ని వాయిదాల పడడం వలనో, సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోవడం వలనో.. ఈ జనరేషన్ కు కథ నచ్చకపోవడం వలనో ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.

 

ఇక గేమ్ ఛేంజర్ హిట్ కాకపోయినా.. ఈసారి ఎలాగైనా పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ కొట్టాలని చరణ్ మంచి కసి మీద ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో RC16 ను మొదలుపెట్టాడు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు.. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును అందుకున్నాడు. ఉప్పెన తరువాత.. ఎన్టీఆర్ కోసం చాలా ఏళ్ళు వేచి ఉన్నాడు. కానీ, ఎన్టీఆర్ మాత్రం బుచ్చి కథ నచ్చక తప్పుకున్నాడు.

 

అయితే ఎన్టీఆర్ కు చెప్పిన కథ కాకుండా ఈలోపు ఇంకో కథను రెడీ చేసి చరణ్ కు వినిపించడం.. అది నచ్చి గ్లోబల్ స్టార్ సినిమాను పట్టాలెక్కించడం కూడా జరిగింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు పెద్దిఅనే  టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు కూడా ఎప్పటినుంచో టాక్. ఈ చిత్రంలో చరణ్ ఒక ఆట కూలీగా కనిపిస్తాడట. అంటే.. ఏ ఆటలోనైనా ఒకరు ఎక్స్టా ఉండి.. ఆ ఆటను గెలిపిస్తాడు. అతనే ఆట కూలీ. ఆ పాత్రలోనే చరణ్ కనిపించనున్నాడట.

 

ఇక ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కీలక  పాత్రలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్నాడు. RC16 కోసం బుచ్చి.. స్టార్ క్యాస్టింగ్ ను తీసుకుంటున్నాడు. తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ నటిని దింపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ దివంగత నటుడు చిరంజీవి సర్జా భార్య, నటి మేఘనా రాజ్ ను ఒక కీలక పాత్ర కోసం సంప్రదించారని, ఆమె  కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

 

మేఘనా రాజ్ తెలుగులో అల్లరి నరేష్ నటించిన బెండు అప్పారావు RMP సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్  సినిమాపై అంచనాలను మరింత పెంచేసుకుంటున్నారు. అసలు ఏం ప్లాన్ చేస్తున్నావ్ బుచ్చి మావా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మేకర్డ్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.