Last Updated:

Chiranjeevi Wishes Ram Charan: రామ్‌ చరణ్‌కి చిరు, ఎన్టీఆర్‌ బర్త్‌ డే విషెస్‌ – పెద్ది టైటిల్‌, లుక్‌పై ఏమన్నారంటే!

Chiranjeevi Wishes Ram Charan: రామ్‌ చరణ్‌కి చిరు, ఎన్టీఆర్‌ బర్త్‌ డే విషెస్‌ – పెద్ది టైటిల్‌, లుక్‌పై ఏమన్నారంటే!

Chiranjeevi Interesting Comments on Charan Peddi Look: గ్లోబల్ స్టార్‌ నేటితో 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మార్చి 27న రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రమఖులు, ఫ్యాన్స్‌ నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సోషల్‌ మీడియా మొత్తం చరణ్‌ బర్త్‌డే పోస్ట్స్‌తో నిండిపోయాయి. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌, కాజల్‌ అగర్వాల్‌తో పాటు మెగాస్టార్, ఆయన తండ్రి చిరంజీవి స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఈ సందర్భంగా తన సినిమా పెద్ది సినిమా గురించి చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు పెద్ది ఫస్ట్‌లుక్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. హ్యాపీ బర్త్‌డే మై డియర్‌ రామ్‌ చరణ్‌. నువ్వు ఎన్నో ఎన్నో పుట్టిన రోజులు జరపుకోవాలని కోరుకుంటున్నా. ‘పెద్ది’ ఫస్ట్‌ చాలా బాగుంది. ఇది నటుడిగా నిన్ను మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. సినీ ప్రియులు, ఫ్యాన్స్‌కి ఇది కనుల పండుగ కానుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.

అలాగే మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ కూడా చరణ్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ‘నా ప్రియమైన సోదరుడు రామ్‌ చరణ్‌కు పుట్టిన రోజు శుభకాంక్షలు. ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఇక డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా కూడా ఎక్స్‌ వేదికగా బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. “నా స్నేహితుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎప్పుడు మరింత ప్రేమతో పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. పెద్ది పోస్టర్‌ చాలా అద్భుతంగా ఉంది” అని పేర్కొన్నారు.