Published On:

Allu Arjun-Trivikram Movie: బన్నీ బర్త్‌డే సర్‌ప్రైజ్‌, అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ సినిమాపై బిగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది!

Allu Arjun-Trivikram Movie: బన్నీ బర్త్‌డే సర్‌ప్రైజ్‌, అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ సినిమాపై బిగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది!

Naga Vamsi Gave Update on Allu Arjun and Trivikram Movie: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సందర్భంగా నిర్మాత నాగవంశీ ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. త్రివిక్రమ్‌-బన్నీ సినిమా అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేడు బన్నీ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి బిగ్‌ అప్‌డేట్ ఇచ్చాడు ప్రముఖ నిర్మాత నాగవంశీ. పుష్ప1, పుష్ప 2 తర్వాత బన్నీ క్రేజ్ ఇంటర్నేషనల్‌ స్థాయికి చేరుకుంది. ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ నేషనల్‌ అవార్డును సైతం కైవసం చేసుకున్నాడు. ఇక గతేడాది విడుదలైన పుష్ప 2 మూవీ సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. దక్షిణాదిలోనే కాదు నార్త్‌లోనూ పుష్ప 2 సత్తాచాటింది.

పుష్ప 2తో ఆల్ టైం రికార్డ్స్..

హిందీలో సినిమాలను సైతం వెనక్కి నెట్టి అత్యధిక గ్రాస్‌ వసూళ్లు చేసిన తొలి సినిమా రికార్డు బ్రేక్‌ చేసింది. అంతేకాదు విడుదలైనప్పటి నుంచి రికార్డు మీద రికార్డులను బ్రేక్‌ చేస్తూ దూసుకుపోయి అత్యధిక వసూళ్లు సాధించిన రెండు చిత్రంగా ఇండియన్‌ బాక్స్‌ఫీసు వద్ద రికార్డు క్రియేట్‌ చేసింది. దీంతో బన్నీ మార్కెట్‌ కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో పుష్ప 2 తర్వాత బన్నీ బాయ్‌ నెక్ట్స్‌ మూవీ ఏంటనేది అందరిలో ఆసక్తి నెలకొంది. పుష్ప 2 షూటింగ్‌ దశలో ఉండగానే తమిళ హిట్‌ డైరెక్టర్ అట్లీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లను లైన్‌లో పెట్టాడు. అయితే ఇద్దరివి భారీ ప్రాజెక్సే కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో ఏ సినిమా ముందు సెట్స్‌పైకి వస్తుందా? అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అయితే దీనికి ఇప్పటి వరకు బన్నీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.

మా ఐకాన్ స్టార్..

కానీ, అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ అట్లీతోనే చేస్తున్నారని మైత్రీ మూవీ మేకర్స్‌ స్పష్టం చేశారు. ఈ సినిమా కోసం బన్నీ మెకోవర్‌ అవుతున్నాడని, ఇందు కోసం ప్రత్యేకంగా విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నట్టు చెప్పారు. త్వరలోనే దీనిపై అనౌన్స్‌మెంట్‌ కూడా రానుందన్నారు. ఈ నేపథ్యంలో అంతా అట్లీ మూవీ అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి నిర్మాత నాగవంశీ ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. అల్లు అర్జున్‌కు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలుపుతూ… త్రివిక్రమ్‌తో సినిమాపై అప్‌డేట్‌ ఇచ్చాడు. “మా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు! కేవలం హద్దులు నిర్ణయించని నిజమైన మార్గదర్శకుడు మాత్రమే కాదు. తన ప్రతిభ, దయ శైలితోనూ రికార్డులు బద్దలు కొడతాడు. అతి త్వరలోనే మీతో మా తదుపరి ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అంటూ బన్నీ పోస్టర్‌ రిలీజ్ షేర్‌ చేశాడు.

పాన్ ఇండియా ప్రాజెక్ట్..

ఇందులో ఏ ఫిలిం బై త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పేరుతో ప్రొడక్షన్‌ నెం 8లో రాధ హరిక్రష్ణ నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సినిమా నాగవంశీ సమర్పకులుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అప్‌డేట్ చూసి అల్లు ఫ్యాన్స్‌ అంత పండగ చేసుకుంటున్నారు. నిజానికి ముందుగా వచ్చేది అట్లీ సినిమా అయినా, త్రివిక్రమ్‌తో ప్రాజెక్ట్‌ కోసం తెలుగు ఆడియన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బన్నీ బర్త్‌డే సందర్భంగా నాగవంశీ ఈ మూవీపై అప్‌డేట్‌ ఇవ్వడంతో అభిమానులంతా సంబరాలు మరింత రెట్టింపు అయ్యాయి. అల్లు అర్జున్‌ కోసం త్రివిక్రమ్‌ మైథలాజికల్‌ డ్రామాను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. మహాభారతం నేపథ్యంలో త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నారట. ఇది పాన్‌ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్ట్‌గా ఈ మూవీ రూపొందనుందని సమాచారం.

 

ఇవి కూడా చదవండి: