Published On:

Telangana Inter Results 2025: ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఫలితాలను తెలుసుకోండిలా!

Telangana Inter Results 2025: ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఫలితాలను తెలుసుకోండిలా!

Telangana Inter Results 2025: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను తెలుసుకునేందుకు www.tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ క్లిక్ చేయాలి. అనంతరం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.

 

ఇదిలా ఉండగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 66.89శాతం ఉత్తీర్ణత.. ఇంటర్ సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు వారం రోజుల సమయం ఇచ్చారు. అలాగే మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్ ‌డ్ పరీక్షలు జరగనున్నాయి.

 

రాష్ట్రంలో జరిగిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు మొత్తం 9.96లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4.48లక్షల మంది ఇంటర్ ఫస్టియర్ హాజరయ్యారు. ఇక సెకండియర్ రెగ్యులర్ విద్యార్థులు 4.40 లక్షల మంది రాశారు. అలాగే సెకండియర్ ప్రైవేట్ విద్యార్థులు 67వేలు రాయగా .. సెకండియర్‌లో రెగ్యులర్, ప్రైవేట్ కలిపి మొత్తం 5.08 లక్షల మంది హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5వ తేదీన ప్రారంభమై మార్చి 25వ తేదీన ముగిశాయి. ఇందులో భాగంగానే అధికారులు ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు.

 

అయితే ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్ www.tgbie.cgg.gov.in ద్వారా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు హాల్ టికెట్ ఎంటర్ చేసి ఒకే క్లిక్ తో రిజల్ట్స్ వచ్చేయనున్నాయి. అలాగే పరీక్ష రాసిన విద్యార్థుల మొబైల్ ఫోన్‌కు ఫలితాల లింక్ పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ లింక్ క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

 

ఇదిలా ఉండగా, విద్యార్థులు ఎలాంటి ఆందోళనలు చెందవద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి విద్యార్థికి నాలెడ్జ్ ఉంటుందని, కేవలం మార్కులు ప్రమాణం కాదని అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు విద్యార్థులకు సహకారం అందించాలని సూచించారు. మిగతా వివరాలకు టోల్ ప్రీ నంబర్ 1800 8914416 కు ఫోన్ చేయవచ్చని వెల్లడించారు.