Published On:

Special Education Post in AP: గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. 2,260 టీచర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్!

Special Education Post in AP: గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. 2,260 టీచర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్!

AP Government given green signal to special education teacher posts: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే డీఎస్పీ ద్వారా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,136 SGT, 1,124 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులను విడుదల చేసింది.

 

ఇందులో భాగంగానే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆటిజంతో పాటు మానసిక వైకల్యం ఉన్న వారికి సైతం విద్యను అందించేలా బలమైన సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం వేర్వేరుగా రెండు ఉత్తర్వులను ఇచ్చింది.

 

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులను సర్కార్ మంజూరు చేసింది. అనంతపురంలో 101 ఎస్టీటీ పోస్టులు, 100 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసుందుకు ఉత్తర్వులు విడుదల చేయగా.. గతంలో 78 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను విడుదల చేసింది. అలాగే చిత్తూరులో 117 ఎస్టీటీ పోస్టులు, 82 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.. ఈస్ట్ గోదావరిలో 127 ఎస్టీటీ, 151 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.. గుంటూరులో 151 ఎస్టీటీ, 98 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.. వైఎస్సార్ కడపలో 57 ఎస్టీటీ పోస్టులు, 49 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.. కృష్ణాలో 71 ఎస్టీటీ పోస్టులు, 89 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.. కర్నూల్‌లో 110 ఎస్టీటీ పోస్టులు, 130 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.. నెల్లూరులో 63 ఎస్టీటీ పోస్టులు, 44 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.. ప్రకాశంలో 74 ఎస్టీటీ పోస్టులు, 50 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.. శ్రీకాకుళంలో 71 ఎస్టీటీ పోస్టులు, 109 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.. విశాఖపట్నంలో 59 ఎస్టీటీ పోస్టులు, 52 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.. విజయనగరంలో 45 ఎస్టీటీ పోస్టులు, 66 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.. వెస్ట్ గోదావరిలో 90 ఎస్టీటీ పోస్టులు, 105 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.