Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా- పవన్ కళ్యాణ్ సవాల్
ఇప్పటంలో ఇళ్ల కూల్చి తన గుండెళ్లో గునపం దింపారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాం అని సవాల్ విసిరారు. కూల్చివేతలో అధికారులు పద్ధతి పాటించలేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం తనను బాధించిందని ఆయన తెలిపారు.
Pawan Kalyan: ఇప్పటంలో ఇళ్ల కూల్చి తన గుండెళ్లో గునపం దింపారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాం అని సవాల్ విసిరారు. కూల్చివేతలో అధికారులు పద్ధతి పాటించలేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం తనను బాధించిందని ఆయన తెలిపారు. ఇప్పటం గ్రామస్థులు జనసేనకు అండగా ఉన్నారనే కక్షతోనే ఇళ్లను కూల్చివేశారని పవన్ మండిపడ్దారు. ఆదివారం మంగళగిరిలో సమావేశం ఏర్పాటు చేసిన జనసేనాని ఇప్పటం బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. బాధితులు ఒక్కొక్కరికీ జనసేన తరఫున రూ.లక్ష చొప్పున పరిహారం చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గడప కూల్చేదాకా విశ్రమించబోమని తేల్చిచెప్పారు. మీలాగ నేను ఢఇల్లీ వెళ్లి చాడీలు చెప్పను అని మోదీని ఎప్పుడు కలిసినా దేశ భవిష్యత్ ప్రజల రక్షణ గురించే మాట్లాడుతా అని వైసీపీని దెబ్బ కొట్టాలంటే ప్రధానికి చెప్పి చెయ్యను నేనే చేస్తా నేను ఇక్కడే పుట్టినవాడ్ని ఇక్కడే తేల్చుకుంటా నా యుద్ధం నేనే చేస్తా అని స్పష్టం చేశారు. ప్రధానితో ఏం మాట్లాడానో చెప్పాలని సజ్జల అనడం ఏంటి నా దగ్గరకు వస్తే చెవిలో చెప్తాను అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సజ్జలపై తీవ్రంగా మండిపడ్డారు పవన్. సజ్జల ప్లాన్ ప్రకారమే ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలు జరిగాయని ఆయన ఆరోపించారు.
తనకు అండగా ఉన్న ఇప్పటం గ్రామస్థులకు తాను అండగా నిలుచుంటానని పేర్కొన్నారు. ఇప్పటం గ్రామస్థుల తెగువ నచ్చిందన్న పవన్.. అమరావతి రైతులు కూడా ఇదే తెగువ చూపించి ఉంటే రాజధాని తరలిపోయేదికాదని పేర్కొన్నారు. ప్రజలు, రైతుల ఇళ్లు, భూములను తగిన పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం లాగేసుకోవడం బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇదీ చదవండి: కోటంరెడ్డిపై కారుతో దాడి