Sriya Reddy Joins in OG Shooting: ఓజీ సెట్‌లో అడుగుపెట్టిన సలార్ బ్యూటీ..!

Actress Sriya Reddy back to OG Sets: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘ఓజీ’ మూవీ షూటింగ్ మళ్లీ మొదలైంది. హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయ్యింది. దీంతో ఇప్పుడు ఓజీ టైం వచ్చేసింది. ఇంకా 15 నుంచి 20 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. దీంతో ఎలాగైన ఈసారి షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు పవన్ కూడా టీంకి మాట ఇచ్చినట్టు తెలుస్తోంది.
దీంతో మే 12న ఓజీ మూవీ మళ్లీ మొదలుపెట్టారు. అయితే ఇంతవరకు పవన్ సెట్‌లో అడుగుపెట్టలేదని తెలుస్తోంది. ఈ రోజు, రేపు పవన్ ఓజీ షూటింగ్‌లో తిరిగి పాల్గొననున్నాడట. అప్పటి పవన్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తోంది మూవీ టీం. అయితే ఈ సెట్‌లో తాజాగా సలార్ బ్యూటీ జాయిన్ అయ్యారట. ఆమె ఎవరో కాదు శ్రియా రెడ్డి. ఈ సినిమాలో ఆమె ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఆమె ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యిందట. ఈమేకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
అయితే ఇందులో పవన్ లేడని సమాచారం. ఇక ఆయన మరో రెండు రోజుల్లో ఓజీ సెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ముంబై గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతున్నట్టు ఇప్పటికే మూవీ టీం వెల్లడించింది. సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన పవన్ లుక్‌కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 70 నుంచి 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంకా 25 నుంచి 20 రోజుల షూటింగ్ మిగిలి ఉందట.
ఈ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేస్తామని మేకర్స్ తెలిపారు. ఇక పవన్ కూడా సుదీర్ఘ సమయం ఈ మూవీ షూటింగ్‌కి కెటాయించనున్నారట. కాగా ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతి కథనాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. పవన్ సరసన ప్రియాంక మోహన్ ఆరుళ్ హీరోయిన్‌గా నటిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.