Last Updated:

Amazon Air: ఇకపై ఒక్కరోజులోనే అమెజాన్ డెలివరీ.. అందుబాటులోకి ‘అమెజాన్ ఎయిర్’

ఇకపై అమెజాన్ ఇండియా లో ఏదైనా ఆర్డర్ పెడితే వినియోగదారులకు వేగంగా చేరుకోనుంది. అందుకోసం ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ..

Amazon Air: ఇకపై ఒక్కరోజులోనే అమెజాన్ డెలివరీ.. అందుబాటులోకి ‘అమెజాన్ ఎయిర్’

Amazon Air: ఇకపై అమెజాన్ ఇండియా లో ఏదైనా ఆర్డర్ పెడితే వినియోగదారులకు వేగంగా చేరుకోనుంది. అందుకోసం ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ .. ‘అమెజాన్ ఎయిర్’ పేరుతో సేవలను ప్రారంభించింది.

ఈ సేవల్లో భాగంగా ప్రత్యేక విమానం ద్వారా వస్తువులను రవాణా చేస్తారు. అందుకోసం క్విక్ జెట్ కార్గో ఎయిర్ లైన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది అమెజాన్ ఇండియా.

ఇప్పటి వరకు యూరప్, నార్త్ అమెరికా దేశాల్లో మాత్రమే ఈ తరహా సేవలు అందుబాటులో ఉన్నాయి. వాటి తర్వాత ఇండియా ఎయిర్ కార్గో సేవలు రానున్నాయి.

ఈ నగరాల మధ్యే ఎయిర్ సేవలు

హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల మధ్య ఈ అమెజాన్ ఎయిర్ సేవలు అందుబాటులో ఉంటాయి. తర్వాత మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరించనుంది అమెజాన్ .

బోయింగ్ 737-800 విమానం ద్వారా ఒక ఫైట్ లో 20 వేల షిప్ మెంట్లను రవాణా చేయొచ్చని కంపెనీ తెలిపింది. దీంతో ఒక్కరోజులోనే ఆర్డర్ చేసుకున్న వస్తువులను కస్టమర్లకు అందించవచ్చు.

దేశంలోని 97 శాతం పిన్ కోడ్ ప్రాంతాల్లో రెండో రోజే వస్తువులను డెలివరీ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. దేశంలో ఎయిర్ కార్గో కోసం ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్న మొదటి సంస్థ అమెజాన్.

అమెజాన్ ఎయిర్ 2016 లో మొదటిసారిగా అమెరికా మార్కెట్ లో సేవలు ప్రారంభించింది. ఆ తర్వాత యూరప్ లో అందుబాటులోకి తీసుకువచ్చారు.

ప్రస్తుతం మన దేశంలో రెండు కార్గో ఎయిర్ క్రాఫ్ట్ లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 70 గమ్య స్ధానాల్లో 110 విమానాలతో వస్తువులను రవాణా చేస్తున్నారు.

 

వేగవంతమైన డెలివరీలు అందించడమే

ఎయిర్ షిప్ మెంట్ కు ఇప్పటి వరకూ వాణిజ్య విమానయాన సంస్థలపై ఆధారపడుతున్నామని.. ఇపుడు అమెజాన్ ఎయిర్ వచ్చిన నేపథ్యంలో మెయిన్ సిటీల మధ్య వస్తు రవాణా సులభంగా

జరుగుతందని అమెజాన్ ప్రతినిధి అఖిల్ సక్సేనా తెలిపారు.

భారత్‌లో అత్యంత వేగంగా డెలివరీలను అందించడమే కాకుండా ఖర్చులను కూడా ఆదా చేస్తుందని కంపెనీ తెలిపింది.

పెరుగుతున్న కస్టమర్ బేస్‌ ఆధారంగా తక్కువ ధరలు, వేగవంతమైన డెలివరీలతో అందించడమే లక్ష్యంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొంది.

ఎయిర్ లాజిస్టిక్స్ కోసం అమెజాన్ వందల మిలియన్ డాలర్లను చ్చించిందని కంపెనీ వెల్లడించింది.

అమెజాన్ కు దేశ వ్యాప్తంగా 50 ఫుల్ ఫిల్ మెంట్ కేంద్రాలు ఉన్నాయి. 15 రాష్ట్రాల్లో 4.3 కోట్ల ఘనపు అడుగుల స్థలం ఉంది.

తెలంగాణలో మొత్తం 4 ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్లు ఉండగా.. అందులో 33 లక్షల ఘనపు అడుగుల స్థలం ఉంది.

అమెజాన్ ద్వారా 11 లక్షల మంది వ్యాపారులు తమ ఉత్పత్తులు అమ్ముతున్నారు.

వినియోగదారులకు , వ్యాపారులకు ఈ ఎయిర్ సర్వీసులు మరింత వెసులు బాటు కల్పిస్తాయి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/