Delhi psycho killer: ఢిల్లీ సైకో కిల్లర్ రవీంద్రకుమార్ కు జీవిత ఖైదు
ఢిల్లీలోని సైకో కిల్లర్ రవీంద్ర కుమార్‌కు దేశ రాజధానిలోని రోహిణి కోర్టు జీవిత ఖైదు విధించింది. 30 మందికి పైగా మైనర్ బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో గురువారం కోర్టు కుమార్‌ను దోషిగా నిర్ధారించింది.
Delhi psycho killer: ఢిల్లీలోని సైకో కిల్లర్ రవీంద్ర కుమార్‌కు దేశ రాజధానిలోని రోహిణి కోర్టు జీవిత ఖైదు విధించింది. 30 మందికి పైగా మైనర్ బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో గురువారం కోర్టు కుమార్‌ను దోషిగా నిర్ధారించింది.
ఏడేళ్లలో 30 మంది బాధితులు..(Delhi psycho killer)
32 ఏళ్ల రవీందర్ కుమార్, చిన్నారులపై అత్యాచారం చేసి చంపిన ఆరోపణలపై 2015లో అరెస్టయ్యాడు. పందొమ్మిదేళ్ల వయసులో తాను తొలిసారి ఈ నేరానికి పాల్పడ్డానని పోలీసులకు చెప్పాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుమార్ 2008 మరియు 2015 మధ్య దాదాపు 30 మంది పిల్లలను లక్ష్యంగా చేసుకున్నాడు. అతని బాధితుల్లో అత్యల్ప వయసు రెండు సంవత్సరాలు కాగా అత్యధిక వయసు 12 సంవత్సరాలు గా ఉన్నారని పోలీసులు తెలిపారు. పోర్న్ హారర్ సినిమాలను చూడటం వల్ల మానసికంగా ప్రభావితమైన తర్వాత అతను ఈ విధంగా మారినట్లు తెలుస్తోంది.
రవీంద్రకుమార్ ఎక్కువగా మురికివాడల్లో ఉండే కూలీల పిల్లలను అతను లక్ష్యంగా చేసుకునేవాడు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి మధ్యలో కూలీల పిల్లలకు రూ.10 కరెన్సీ నోటు లేదా స్వీట్లతో ఎర వేసేవాడు. వారిని ఒంటరి భవనం లేదా ఖాళీ మైదానంలోకి తీసుకెళ్లి వారిపై దాడి చేసేవాడు. తరువాత తనను గుర్తిస్తారనే భయంతో వారిని చంపేవాడు.