Chandrababu-Bill gates: బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. ఏపీలో కొత్త ఆవిష్కరణలకు కృషి!

CM Chandrababu Meeting With Bill Gates: ఏపీ సీఎం చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలపై బిల్ గేట్స్ పోస్టు చేశారు. రాష్ట్రంలో మెరుగైన ఆరోగ్యంలో పాటు వ్యవసాయం, విద్యా రంగాల్లో కొత్త ఆవిష్కరణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎదురుచూస్తున్నట్లు వివరించారు. కాగా, అంతకుముందు రోజు ఢిల్లీలో బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా రాష్ట్రానికి సంబంధించి బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, చంద్రబాబుతో పాటు బిల్ గేట్స్ సమక్షంలో ఏపీ సర్కార్, గేట్స్ ఫౌండేషన్ వర్గాలు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. లేటెస్ట్ టెక్నాలజీతో వైద్యం, ఆరోగ్యం, మెడ్ టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారాలు కనుక్కొంటారు. ఆ తర్వాత సమస్యలను పరిష్కరించి వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.
అంతేకాకుండా, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం సాధించేందుకు ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు మరింత పురోగతి సాధించేందుకు మద్దతు ఇస్తున్న బిల్ గేట్స్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అనంతరం బిల్ గేట్స్ మాట్లాడారు. డేటా ఆధారంగా సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధిలో నిలబెడుతున్నారన్నారు. తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఒఫ్పందం ఇతర రాష్ట్రాలకు ఉదాహరణగా కనిపిస్తుందని బిల్ గేట్స్ అన్నారు.