Last Updated:

Afghanistan women: ప్రపంచంలోనే అత్యంత అణచివేతను ఎదుర్కొంటున్నారు.. ఆఫ్గనిస్తాన్‌ మహిళలపై ఐక్యరాజ్యసమితి ప్రకటన

: ప్రపంచంలోనే అత్యంత వివక్షకు గురయ్యే మహిళలు ఎవరంటే ఆఫ్గనిస్తాన్‌ మహిళలే అని చెప్పవచ్చు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి మహిళల పరిస్థితి పెనంలోంచి పొయ్యిలోకి పడ్డట్టయింది.

Afghanistan women: ప్రపంచంలోనే అత్యంత అణచివేతను ఎదుర్కొంటున్నారు..  ఆఫ్గనిస్తాన్‌ మహిళలపై  ఐక్యరాజ్యసమితి ప్రకటన

 Afghanistan women: ప్రపంచంలోనే అత్యంత వివక్షకు గురయ్యే మహిళలు ఎవరంటే ఆఫ్గనిస్తాన్‌ మహిళలే అని చెప్పవచ్చు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి మహిళల పరిస్థితి పెనంలోంచి పొయ్యిలోకి పడ్డట్టయింది. మహిళలు కనీస హక్కులకు నోచుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి బుధవారం నాడు పేర్కొంది.

బాలికలను, మహిళలను ఇంటికే పరిమితం చేసేలా చట్టాలు..(Afghanistan women)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూఎన్‌ మిషన్‌… ఆఫ్టనిస్తాన్‌ మహిళల వెతల గురించి ఒక ప్రకటనలో వివరించింది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఫోకస్‌ అంతా మహిళల హక్కులను కాలరాయడమేనని .. బాలికలను, మహిళలను ఇంటికే పరిమితం చేసేలా చట్టాలను తీసుకువచ్చారని పేర్కొంది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల హక్కులను కాలరాయమని హామీలు గుప్పించింది. అంతకు ముందు ఆగస్టు 2021లో అమెరికాతో పాటు నాటో దళాలు రెండు దశాబ్దాల పాటు ఆఫ్గానిస్తాన్‌లో యుద్ధంలో పాల్గొని అటు తర్వాత ఆఫ్గాన్‌ నుంచి తమ తమ స్థావరాలకు తరలిపోయాయి. వారు అలా వెళ్లగానే తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నారు.

తాలిబన్లు ఆఫ్గనిస్తాన్‌లో అధికారం చేపట్టిన వెంటనే దేశం నుంచి లక్షలాది మంది పౌరులు ఇతర దేశాలకు వలస వెళ్లారు. తాలిబన్లు వచ్చి రాగానే బాలికలు ఆరవ తరగతి తర్వాత చదువుకోవడానికి వీల్లేదని హకుం జారీ చేశారు. అటు తర్వాత మహిళలు పబ్లిక్‌ ప్లేస్‌ అంటే పార్కులు కానీ, జిమ్‌లకు కానీ వెళ్లడానికి వీల్లేదని ఆంక్షలు విధించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే మహిళలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో కానీ ఎన్‌జీవో సంస్థల్లో పనిచేయడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది. అలాగే మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి రావాలంటే తల నుంచి కాళ్లకు పూర్తిగా బురఖా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని ఆంక్షలు ఆఫ్గనిస్తాన్‌ మహిళలపై రుద్దారు తాలిబన్లు. మహిళల హక్కులను దారుణంగా కాలరాశారని యు ఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆఫ్గానిస్తాన్‌ ప్రత్యేక ప్రతినిధి రోజా ఒటున్బయేవా చెప్పారు. తాలిబన్లు ఒక పద్ధతి ప్రకారం కావాలని ఆఫ్గానిస్తాన్‌ మహిళలు, బాలికలను ప్రజా క్షేత్రం నుంచి తప్పించడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని ఆమె అన్నారు.

విద్యకు, ఉద్యోగాలకు దూరం..

మహిళలపై నిర్బంధాల విషయానికి వస్తే ముందుగా బాలికలను విద్యకు దూరం చేయడం, ఉద్యోగాలపై ఆంక్షలు విధించడంలపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కాస్తా భయపడి వెనక్కి తగ్గింది తాలిబన్‌ సర్కార్‌. ఇవన్నీ తాత్కాలికమేనని మహిళలు ఇస్లామిక్ వస్త్రధారణ  హెడ్‌ స్కార్ప్ లేదా హిజాబ్‌ ధరించడం లేదని కారణం చూపించింది. ఇక యూనివర్శిటీ విద్య విషయానికి వస్తే యూనివర్శిటీలో చెప్పే చదవులు ఇస్లామిక్‌ విలువకు వ్యతిరేకంగా ఉన్నాయని వారు తమ చర్యను సమర్థించుకున్నారు.దేశ జనాభాలో సగం మంది ఇంటికే పరిమితం అయితే.. ప్రపంచంలోనే అతి పెద్ద మానవ సంక్షోభంతో పాటు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది ఆఫ్గానిస్తాన్‌. ప్రభుత్వమే తమకు తామే స్వీయహాని తలపెట్టుకుంటోందని యూఎన్‌ ప్రతినిధి అన్నారు. ఆఫ్గానిస్తాన్‌ ప్రస్తుతం అత్యంత పేదరికంలో మగ్గుతోంది. ప్రపంచదేశాలు ఆదుకుంటే కానీ పూట గడవని పరిస్థితి. కాగా ఆఫ్గానిస్తాన్‌ ప్రభుత్వం తమ ప్రజల నుంచే దూరం కావడంతో పాటు ప్రపంచదేశాల్లో ఆఫ్గాన్‌ ఏకాకి అవుతోంది.

మహిళలపై పలు నిర్బంధాలు..

తాలిబన్లు అధికారం చేజిక్కించుకోగానే మహిళలు తీవ్రమైన వివక్షకు గురవుతున్నారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించడానికి వీల్లేదు. ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే లెక్కలేనన్ని నిర్బంధాలు. బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్చగా తిరగడానికి వీల్లేదు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు వీల్లేదు. తాలిబన్లు తమ సొంత పౌరులు మహిళలు, బాలికలను హాని తలపెడుతోందని ఆప్టానిస్తాన్‌లో మహిళల యూఎన్‌ ప్రత్యేక ప్రతినిధి అలీసన్‌ డెవిడియన్‌ అన్నారు. ఒక అంచనా ప్రకారం సుమారు 11.6 మిలియన్‌ ఆఫ్గాన్‌ మహిళలు, బాలకలకు తక్షణమే సాయం కావాల్సి ఉందని యూఎన్‌ తెలిపింది. ప్రపంచదేశాలన్నీ తాలిబన్లపై ఒత్తిడి తెస్తే కానీ ఇక్కడ మహిళలు స్వేచ్చ లభించే అవకాశమే లేదని ఆప్గాన్‌ పౌరహక్కల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.