Last Updated:

Akshay Kumar: పరమ శివుడిగా అక్షయ్‌ కుమార్‌ – ‘కన్నప్ప’ మూవీ నుంచి ఆయన లుక్‌ రిలీజ్‌

Akshay Kumar: పరమ శివుడిగా అక్షయ్‌ కుమార్‌ – ‘కన్నప్ప’ మూవీ నుంచి ఆయన లుక్‌ రిలీజ్‌

Akshay Kumar look From Kannappa Movie: మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్‌గా కన్నప్ప మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్‌ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఏప్రిల్‌ 25 వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌ అవుతుండటంతో షూటింగ్‌తో పాటు ప్రమోషన్‌ కార్యక్రమాలను జరుపుకుటుంది ఈ సినిమా.

బాలీవుడ్‌ డైరెక్టర్ ముఖేస్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్, అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ తెరకెక్కుతోన్న ఈ సినిమాను మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని ‘భక్త కన్నప్ప’ చరిత్రలను స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కిస్తున్నారు. ముందు నుంచి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో దాదాపు భారీతారగణం నటిస్తోంది.

మోహన్‌ బాబు, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్, కాజల్‌ అగర్వాల్‌, మధుబాల, శరత్‌ కుమార్‌, ముఖేష్‌ రిషి, దేవరాజ్, ఐశ్వర్య భాస్కరన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిష్తున్నారు. కొద్ది రోజులుగా ఈ సిసినిమాలోనే స్టార్స్‌ని వారి పాత్రలను పరిచయం చేస్తున్న మూవీ టీం తాజాగా సరికొత్త అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ చిత్రంలో కీలక పాత్రైన శివుడి పాత్రను పరిచయం చేశారు. మహాశివుడిగా అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్నట్టు ఆయన సంబంధించిన లుక్‌ని రిలీజ్‌ చేశాడు. శివుడి లుక్‌లో ఉన్న అక్షయ్ కుమార్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేస్తూ.. ‘ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు భక్తికి మాత్రం దాసుడు’ అంటూ అక్షయ్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్టర్‌ బాగా ఆకట్టుకుంటుంది. కాగా పార్వతి దేవి పాత్రలో కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా.. ఇప్పటికే ఆమె లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఇక ఇందులో ప్రభాస్‌ నందిగా కనిపించనున్నాడని టాక్‌. ఇందులో ఆయన లుక్‌కి ఇటీవల లీక్‌ కావడంతో మూవీ టీం సీరియస్‌ అయ్యింది. ఇక ఈసినిమాతోనే మంచు విష్ణు తనయుడు అవ్‌రాం ఇండస్ట్రీ బాలనటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇందులో మంచు విష్ణు చిన్ననాటి పాత్రలో కనిపించబోతున్నాడు. చిన్నారి తిన్నడుగా అవ్‌రాం మంచు చేస్తున్నాడు. గతేడాది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ చిన్నారి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. దీనికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.