Published On:

Manchu Manoj: ‘దొంగప్ప’ వచ్చేస్తున్నాడు – కన్నప్ప రిలీజ్‌పై మంచు మనోజ్‌ సెటైర్లు, ట్వీట్‌ వైరల్‌

Manchu Manoj: ‘దొంగప్ప’ వచ్చేస్తున్నాడు – కన్నప్ప రిలీజ్‌పై మంచు మనోజ్‌ సెటైర్లు, ట్వీట్‌ వైరల్‌

Manchu Manoj Satirical Comments on Kannappa Release: మంచు ఫ్యామిలీలోని వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కొద్దిరోజులుగా నటుడు మోహన్‌ బాబు ఇంట్లో గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటి నుంచో మంచు బ్రదర్స్‌ పడటం లేదు. అయితే వారి రూమర్స్‌ మాత్రమే అన్నట్టు చూపించారు. గతేడాది డిసెంబర్‌లో ఒక్కసారిగా మంచు ఫ్యామిలీ గొడవలు భగ్గుమన్నాయి. మోహన్‌ బాబు, మనోజ్‌లు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

మంచు ఫ్యామిలీ రగడ

కొన్ని రోజుల పాటు ఈ వివాదంలో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్‌ అయ్యారు. తాజాగా మారోసారి మంచు ఫ్యామిలీలో రగడ మొదలైంది. తన అన్నయ్య మంచు విష్ణుపై మనోజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ఇంట్లో లేని సమయంలో విష్ణు తన అనుచరులతో కలిసి తన కారు, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశాడని ఆరోపించాడు. అలాగే జల్‌పల్లిలోని నివాసం ముందు నిరసన చేపట్టాడు. ఇలా మరోసారి మంచు ఫ్యామిలీ వివాదంలో రచ్చకెక్కింది.

 

కన్నప్ప వాయిదా

అంతేకాదు తనకు భయపడి కన్నప్ప సినిమాను వాయిదా వేసుకున్నాడని కూడా మనోజ్‌ అన్నాడు. అతడు అన్నట్టుగా కన్నప్ప సినిమా వాయిదా పడింది. ఏప్రిల్‌ 25న రావాల్సిన సినిమా జూన్‌ 27కు వాయిదా పడింది. ఈ విషయాన్ని మంచు విష్ణు తన తన ట్వీట్‌ ద్వారా వెల్లడించింది. మీ క్యాలెండర్లను మార్క్‌ చేసుకొండి. జూన్‌ 27న ది లెజెండ్‌ ఆఫ్‌ కన్నప్ప థియేటర్లోకి రానుంది తెలిపాడు. విష్ణు ట్వీట్‌ చేసిన కాసేపటికే మనోజ్‌ ఓ ట్వీట్‌ చేశాడు. కన్నప్ప మూవీని ఉద్దేశిస్తూ దొంగప్ప అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు.

 

‘దొంగప్ప’ రిలీజ్ ఎప్పుడు

‘మీ క్యాలెండర్లను మార్క్‌ చేసుకోండి. ది లెజెండ్‌ ఆఫ్‌ దొంగప్ప వచ్చేస్తున్నాడు. జూన్‌ 27న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. అయితే ఇంతకి రిలీజ్‌ డేట్‌ జూలై 17న.. లేదా జూన్‌ 27. వందకోట్ల (80 శాతం విస్మిత్‌ కమిషన్‌) బడ్జెట్‌ మూవీకి పీఆర్‌ ప్లానింగ్‌ కేక’ అని సటైర్లు విసిరాడు. ప్రస్తుతం మనోజ్‌ ట్వీట్‌ హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు.